ETV Bharat / international

ముగ్గురి DNAలతో శిశువులకు జన్మ... చిన్నారులకు ఆ వ్యాధులు అసలే రావట!

జన్యుపరమైన వ్యాధులకు చెక్​పెట్టేందుకు బ్రిటన్ శాస్త్రవేత్తలు కీలక ప్రయోగాలు చేస్తున్నారు. మైటోకాండ్రియల్ డిజార్డర్​ను అరికట్టేందుకు ముగ్గురి డీఎన్​ఏలతో కలిపి ఓ శిశువు జన్మించేలా చేస్తున్నారు.

three dna baby
three dna baby
author img

By

Published : May 10, 2023, 8:51 PM IST

Updated : May 10, 2023, 9:21 PM IST

బ్రిటన్​ శాస్త్రవేత్తలు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ముగ్గురు వ్యక్తుల డీఎన్​ఏతో ఓ శిశువును సృష్టిస్తున్నారు. శిశువుల్లో జన్యుపరమైన వ్యాధులను నివారించడానికే ఇలా చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా బ్రిటన్​లో ఐదుగురు శిశువులను ఇప్పటివరకు జన్మించినట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారికంగా హ్యూమన్ ఫెర్టిలైజేషన్​ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ(హెచ్​ఈఎఫ్​ఏ) తెలిపింది.

జన్యుపరమైన లోపాల వల్ల కండరాల బలహీనత, మూర్ఛ, గుండె సమస్యలు వంటి వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులను నివారించేందుకే శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేపట్టినట్లు గార్డియన్ పత్రిక ఓ కథనంలో తెలిపింది. బ్రిటన్‌లో ప్రతి 200 మంది పిల్లల్లో ఒకరు మైటోకాండ్రియల్​ డిజార్డర్‌తో పుడుతున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు జన్యుపరమైన లోపాలను సరిదిద్దేందుకు ముగ్గురు డీఎన్​ఏలను ఉపయోగించి ఒక శిశువును సృష్టిస్తున్నారు. మైటోకాండ్రియా డొనేషన్ టెక్నిక్ ద్వారా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మెక్సికోలో 2016లో ఓ శిశువు జన్మించింది.

ఇదీ ప్రాసెస్​..
ఈ టెక్నిక్​లో మొదట.. మైటోకాండ్రియల్​ డిజార్డర్​తో బాధపడుతున్న మహిళ అండం నుంచి జన్యుపదార్థాలను సేకరిస్తారు. దాత ఇచ్చిన అండంలో మైటోకాండ్రియాను సజీవంగా ఉంచి.. కీలకమైన డీఎన్​ఏలను తొలగిస్తారు. మొదటి మహిళ నుంచి సేకరించిన జన్యు పదార్థాలను.. దాత అండంలోకి బదిలీ చేస్తారు. ఆ అండాన్ని మహిళ శరీరంలో ప్రవేశపెడతారు.

"బ్రిటన్​లో మైటోకాండ్రియల్​ వ్యాధితో చాలా మంది శిశువులు బాధపడుతున్నారు. ఇలా తమ గర్భంలో డీఎన్​ఏలను ప్రవేశపెట్టుకునేందుకు ప్రతి మహిళ హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ అనుమతి పొందాలి. ఇలా మహిళలు చేయడం వల్ల శిశువులు జన్యు సంబంధమైన వ్యాధులు బారిన పడకుండా పుడతారు. అలాగే మైటోకాండ్రియల్​ వ్యాధి ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. ఇలా ఇప్పటివరకు 32 మంది మహిళలు మైటోకాండ్రియా డొనేషన్ టెక్నిక్ ద్వారా శిశువులను కనేందుకు అనుమతి పొందారు."
-హ్యూమన్ ఫెర్టిలైజేషన్​ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ

రెండు మగ ఎలుకల సంతానం..
జపాన్​ శాస్త్రవేత్తలు ఓ అరుదైన ఘనత సాధించారు. రెండు మగ ఎలుకల నుంచి ఓ సంతానాన్ని ఉత్పత్తి చేశారు. జపాన్‌లోని క్యుషు, ఒసాకా విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల బృందం ఈ ఏడాది మార్చిలో ఈ ఘనతను సాధించింది. పురుష జీవుల చర్మ కణాలలో నుంచి.. అండాలను సేకరించి ఈ ఎలుకలను రూపొందించినట్లు ది గార్డియన్ వార్తా పత్రిక నివేదించింది. మానవులలో కొత్త సంతానోత్పత్తి చికిత్సలకు ఇది దోహదపడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : May 10, 2023, 9:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.