ETV Bharat / international

జారిపడ్డ పుతిన్.. విరిగిన తుంటి ఎముక​.. ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మాస్కోలోని అధికారిక నివాసంలో మెట్లు దిగుతుండగా పడిపోయారని, దీంతో తుంటి ఎముక విరిగిపోయిందని న్యూయార్క్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది. అతని ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతోందని అందులో రాసుకొచ్చింది.

Putin Health
Putin Health
author img

By

Published : Dec 4, 2022, 9:33 PM IST

Updated : Dec 4, 2022, 9:47 PM IST

Putin Health: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోగ్యంపై రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఆయన చేతులు పర్పుల్‌ రంగులోకి మారిపోయాయని, తీవ్ర అనారోగ్యం వల్లే ఇలా జరిగిందంటూ ఇటీవల వార్తలు గుప్పుమన్నాయి. తాజాగా ఆయన..మాస్కోలోని అధికారిక నివాసంలో మెట్లు దిగుతుండగా పడిపోయారని, దీంతో తుంటి ఎముక విరిగిపోయిందని న్యూయార్క్‌ పోస్ట్‌ తన కథనంలో పేర్కొంది. తుంటి ఎముక దెబ్బతిన్న కారణంగా అతని ప్రమేయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతోందని అందులో రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిపింది. పుతిన్‌ రక్షణ సిబ్బందితో సన్నిహిత సంబంధాలున్న ఓ టెలిగ్రామ్‌ ఛానెల్‌ చెప్పిన విషయాలను ఈ సందర్భంగా న్యూయార్క్‌ పోస్ట్‌ ఉటంకించింది.

ఇటీవల క్యూబా అధ్యక్షుడు మిగుయేల్‌ డియాజ్‌తో ద్వైపాక్షిక భేటీ సందర్భంగా వారిద్దరూ కరచాలనం చేసుకుంటున్న సందర్భంలో తీసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఫొటోలో పుతిన్‌ చేతులు పర్పుల్‌ రంగులో ఉన్నాయి. దీనిపై బ్రిటన్‌ ఆర్మీ మాజీ అధికారి, హౌస్‌ సభ్యుడు లార్డ్స్‌ రిచర్డ్‌ దనత్‌ కూడా స్పందించారు. చేతులపై ఉన్న మచ్చలను నిశితంగా పరిశీలిస్తే.. ఇంజక్షన్‌ సూదులు గుచ్చడం వల్ల ఏర్పడినట్లుగా కనిపిస్తోందని ఆయన అన్నారు. దానివల్లే బహుశా చేతులు రంగుమారి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.ఈ వార్తలన్నీ పుతిన్‌ ఆరోగ్యం క్షీణిస్తోందన్న పుకార్లకు మరింత ఊతమిచ్చే విధంగా ఉన్నాయి.మరోవైపు పుతిన్‌ బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్నారంటూ ఇటీవల ఆయనతో సన్నిహిత సంబంధాలున్న ఓ వ్యక్తి వెల్లడించడం ఆయన ఆరోగ్యంపై చర్చకు తావిస్తోంది.

Last Updated : Dec 4, 2022, 9:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.