Pakistan On Chandrayaan 3 : చందమామ దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేపట్టేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ- ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం తుది అంకానికి రంగం సిద్ధమైంది. జాబిల్లిపై ల్యాండింగ్ కోసం భారతీయులతో పాటు ప్రపంచమంతా ఎదురుచూస్తోంది. అయితే మన ప్రయోగంపై పాకిస్థాన్ ప్రశంసలు కురిపించింది. పాక్ మాజీ మంత్రి ఫవాద్ ఛౌదరీ ఈ మిషన్‌ను అభినందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు.
Pakistan Minister On Chandrayaan 3 : "పాకిస్థాన్ మీడియా చంద్రయాన్-3 ల్యాండింగ్‌ను ప్రసారం చేయాలి. మానవాళికి మరీ ముఖ్యంగా భారత అంతరిక్ష రంగానికి ఇవి చరిత్రాత్మక క్షణాలు. అభినందనలు" అని ట్విట్టర్ (ఎక్స్)లో రాసుకొచ్చారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హయాంలో ఫవాద్.. సమాచార, ప్రసార శాఖ మంత్రిగా పనిచేశారు.
-
Pak media should show #Chandrayan moon landing live tomorrow at 6:15 PM… historic moment for Human kind specially for the people, scientists and Space community of India…. Many Congratulations
— Ch Fawad Hussain (@fawadchaudhry) August 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pak media should show #Chandrayan moon landing live tomorrow at 6:15 PM… historic moment for Human kind specially for the people, scientists and Space community of India…. Many Congratulations
— Ch Fawad Hussain (@fawadchaudhry) August 22, 2023Pak media should show #Chandrayan moon landing live tomorrow at 6:15 PM… historic moment for Human kind specially for the people, scientists and Space community of India…. Many Congratulations
— Ch Fawad Hussain (@fawadchaudhry) August 22, 2023
'చంద్రయాన్-3 విజయవంతమైనట్లే'
Mike Gold Nasa On Chandrayaan 3 : మరోవైపు, ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై నాసా మాజీ అధికారి, రెడ్ వైర్ స్పేస్ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ మైక్ గోల్డ్.. ప్రశంసలు కురిపించారు. ఈ ప్రయోగం ఫలితం ఎలాగున్నా.. అది విజయవంతమైనట్లే అని ఆయన అన్నారు.
"మనం నూతన శకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ ప్రయోగం.. కీలకమైన సమాచారాన్ని అందిస్తుంది. చంద్రుడిపై మన అవగాహనను పెంచుతుంది. జాబిల్లిపై మానవ వనరులను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. స్థిరమైన ఉనికిని నెలకొల్పడానికి సహాయం చేస్తుంది. ప్రస్తుతం నాసా, ఇస్రో సంయుక్తంగా భూమిపై పరిశోధనలకు NISAR వంటి ప్రాజెక్ట్స్‌తో తమ దృష్టిని కేంద్రీకరించాయి. భూమిపై రాడార్ వ్యవస్థలతో అధ్యయనం చేయబోతున్నాం. ప్రపంచంలోని వాతావరణ మార్పులను పరిష్కరించడానికి డేటాను పొందనున్నాం. భవిష్యత్తులో రోబో, మానవులను.. అంతరిక్ష అన్వేషణకు పంపనున్నాం" అని తెలిపారు.
Chandrayaan 3 Landing Time : భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ఎటువంటి అవాంతరాలు లేకపోతే బుధవారం (ఆగస్టు 23న) చందమామ దక్షిణ ధ్రువం వద్ద దిగవచ్చని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అధ్యక్షుడు సోమనాథ్ వెల్లడించారు. ఒకవేళ ఏ కారణం వల్లనైనా ఆగస్టు 23న చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుడిపై దిగలేకపోతే 27వ తేదీన దిగే ప్రయత్నం చేస్తామన్నారు. ఆ పని దిగ్విజయంగా పూర్తయితే చంద్రుడిపై ల్యాండర్-రోవర్‌ను దింపిన ఘనత అమెరికా, రష్యా, చైనాల తరవాత భారతదేశానికే దక్కుతుంది.