Operation Ajay Israel : ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం చేపట్టిన 'ఆపరేషన్ అజయ్'లో.. 212 మందితో కూడిన తొలి విమానం శుక్రవారం దిల్లీకి చేరింది. వీరికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. గురువారం టెల్ అవీవ్‌కు చేరుకున్న చార్టర్డ్ విమానం.. అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం బయలు దేరింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్న ఉద్రిక్త వాతావరణంలో నుంచి తమను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.
-
#WATCH | Operation Ajay: First flight carrying 212 Indian nationals from Israel, lands in Delhi pic.twitter.com/iwT9ugIREP
— ANI (@ANI) October 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Operation Ajay: First flight carrying 212 Indian nationals from Israel, lands in Delhi pic.twitter.com/iwT9ugIREP
— ANI (@ANI) October 13, 2023#WATCH | Operation Ajay: First flight carrying 212 Indian nationals from Israel, lands in Delhi pic.twitter.com/iwT9ugIREP
— ANI (@ANI) October 13, 2023
-
#WATCH | Israel: "I am very happy. It has been very scary here... Thank you Indian government for this evacuation..," says Visesh an Indian passenger returning to India from Tel Aviv under 'Operation Ajay' pic.twitter.com/8cL2p5AkhX
— ANI (@ANI) October 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Israel: "I am very happy. It has been very scary here... Thank you Indian government for this evacuation..," says Visesh an Indian passenger returning to India from Tel Aviv under 'Operation Ajay' pic.twitter.com/8cL2p5AkhX
— ANI (@ANI) October 12, 2023#WATCH | Israel: "I am very happy. It has been very scary here... Thank you Indian government for this evacuation..," says Visesh an Indian passenger returning to India from Tel Aviv under 'Operation Ajay' pic.twitter.com/8cL2p5AkhX
— ANI (@ANI) October 12, 2023
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ ప్రభుత్వం ఏ భారతీయుడిని వదిలిపెట్టదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. 'ఇజ్రాయెల్‌లో చిక్కుక్కున్న భారతీయులను రక్షించడానికి, సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి మా ప్రభుత్వం, ప్రధాన మంత్రి కట్టుబడి ఉన్నారు. భారతీయులను క్షేమంగా వారి ఇళ్లకు చేరేలా చేసిన విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, మంత్రిత్వ శాఖ, ఎయిర్ఇండియా సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అని మంత్రి చెప్పారు.
-
#WATCH | Union Minister Rajeev Chandrasekhar says, "...Our government will never leave any Indian behind. Our government, our Prime Minister is determined to protect them, bring them back home safely. We are grateful to EAM Dr S Jaishankar, the team at the External Affairs… https://t.co/XPUDlnv3Lf pic.twitter.com/kZuaKmIYSY
— ANI (@ANI) October 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Union Minister Rajeev Chandrasekhar says, "...Our government will never leave any Indian behind. Our government, our Prime Minister is determined to protect them, bring them back home safely. We are grateful to EAM Dr S Jaishankar, the team at the External Affairs… https://t.co/XPUDlnv3Lf pic.twitter.com/kZuaKmIYSY
— ANI (@ANI) October 13, 2023#WATCH | Union Minister Rajeev Chandrasekhar says, "...Our government will never leave any Indian behind. Our government, our Prime Minister is determined to protect them, bring them back home safely. We are grateful to EAM Dr S Jaishankar, the team at the External Affairs… https://t.co/XPUDlnv3Lf pic.twitter.com/kZuaKmIYSY
— ANI (@ANI) October 13, 2023
"సైరన్లు మోగినప్పుడు అక్కడ షెల్టర్లలో తలదాచుకోవచ్చు. అక్కడ పౌరులకు మంచి రక్షణ ఉంటుంది. కానీ మేము అలాంటి పరిస్థితులు మాకు ఎప్పుడు అలవాటు లేదు. అందుకే చాలా భయం వేసింది. మేం బయల్దేరే సమయంలో కూడా సైరన్లు మోగుతూనే ఉన్నాయి. ఆ సైరన్ల మోత ఇంకా మా చెవుల్లో మార్మోగుతూనే ఉంది. ఆ భయానక పరిస్థితులను వర్ణించలేం. "
--ఆంచల్ వశిష్ట్, పీహెచ్‌డీ విద్యార్థి
"హమాస్ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌లో భయానక వాతావరణం నెలకొంది. అక్కడ ఏమి చేయాలో ఏమి చేయకూడదో మాకు తెలియదు. రాకెట్ల దాడి ప్రారంభమైన వెంటనే షెల్టర్లలోకి వెళ్లాలి అన్నదే మాకు తెలుసు. కానీ అక్కడి పరిస్థితి సాధారణంగా లేదు. భారత్‌లో ఉన్న మా కుటుంబసభ్యుల చాలా భయపడ్డారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా భారత్ వచ్చేయమన్నారు. అదృష్టవసాత్తు తొలి విమానంలోనే ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు వచ్చాను."
--దీపక్ శర్మ, విద్యార్థి
శరణార్థ శిబిరంపై దాడి.. ఒకే చోట 45 మంది మృతి
Israel Attack On Gaza : మరోవైపు, ఇజ్రాయెల్-హమాస్‌లు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఉత్తర గాజాలోని జబాలియా ప్రాంతంలో ఉన్న ఓ శరణార్థ శిబిరంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో 45 మంది మృతి చెందారు. డజన్ల కొద్దీ గాయపడినట్లు గాజా హోం శాఖ గురువారం వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం ఈ దాడి జరిగినట్లు గాజా హోం శాఖ ప్రతినిధి ఇయాద్ బోజుమ్ తెలిపారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. శిథిలాల కింది నుంచి మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికితీస్తున్నారని బోజుమ్ తెలిపారు.
Israel Hamas War USA : ఇదిలా ఉండగా.. యుద్ధ సమయంలో ఇజ్రాయెల్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న అమెరికా.. తమ సైనాన్ని మాత్రం ఆ దేశానికి పంపే ఆలోచన లేదంటోంది. ఈ మేరకు శ్వేత సౌధం జాతీయ భద్రతా ప్రతినిధి జాన్ కిర్బీ గురువారం తెలిపారు. మరోవైపు, ఇజ్రాయెల్‌కు ఏ మేర సైనిక సహాయం కావాలో నిర్ణయించేందుకు యూఎస్ రక్షణ శాఖ కార్యదర్శి ఆ దేశంలో శుక్రవారం పర్యటన చేపట్టనున్నారు. పర్యటనలో భాగంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌తో భేటీ అవుతారు.