ETV Bharat / international

దీపావళికి స్పెషల్​ గుర్తింపు.. పబ్లిక్​ హాలీడేగా ప్రకటించిన న్యూయార్క్​ సర్కార్​ - Diwali Public Holiday

అమెరికాలోని న్యూయార్క్​ సర్కార్​ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్​లో ఎంతో వైభవంగా జరుపుకునే దీపావళి పండుగను పబ్లిక్​ హాలీడేగా ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు వెలుగులిచ్చే దీపావళి పండుగ విశిష్టత తెలుస్తుందని అధికారులు తెలిపారు.

public holiday on diwali
diwali holiday in newyork
author img

By

Published : Oct 21, 2022, 2:07 PM IST

Diwali Holiday New York: అతిత్వరలో దీపావళి పండగ ఇంటింటా సందడి చేయనుంది. ఇప్పటికే పూజ సామాన్లు నుంచి టపాసుల​ వరకు అన్ని సిద్ధం చేసుకుంటున్నారు ప్రజలు. ఇక పండగ అంటే సెలవు ఉండాల్సిందేగా మరి. అందుకే ముఖ్యమైన పండుగలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. విద్యార్థులకు సెలవులు ప్రకటిస్తాయి. అయితే మన భారత్​లో ఎంతో వైభవంగా జరుపుకునే ఈ పండుగకు అమెరికాలో సైతం పబ్లిక్​ హాలిడేగా ప్రకటించారు.

2023 నుంచి న్యూయార్క్​ సిటీలోని విద్యాసంస్థలన్నింటికీ దీపావళి పండుగకు సెలవు ఇవ్వనున్నట్లు మేయర్​ ఎరిక్​ ఆడమ్స్​ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులకు వెలుగులిచ్చే దీపావళి పండుగ విశిష్టత తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. చీకటిని తరిమికొట్టి వెలుగులను నిలిపే ఈ దీపాల పండుగను అందరూ జరుపుకోవాలని న్యూయార్క్​ అసెంబ్లీ సభ్యురాలు జెన్నిఫర్​ రాజ్​కుమార్​ కోరారు.

బంగారు కాంతుల కళ!
న్యూయార్క్​లోని టైమ్స్​ స్క్వేర్​కు దీపావళి కళ సంతరించుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​ తమ నివాసాల్లో వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు ప్రవాస భారతీయ ప్రముఖులను, దౌత్యవేత్తలను ఆహ్వానించారు. నగరంలోని భారత సంతతికి చెందిన ప్రముఖులు గురువారం రాత్రి నుంచే అమెరికన్ రాజధానికి వెళ్లడం ప్రారంభించారు. దీంతో బైడెన్ హయాంలోనూ దీపకాంతులు కనపడుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​తో పాటు ప్రథమ మహిళ జిల్ బైడెన్ సోమవారం దీపావళిని జరుపుకోవడానికి శ్వేత సౌధానికి ఇండో అమెరికన్లను ఆహ్వానించారు. అక్టోబర్ 26న విదేశాంగ కార్యదర్శి టోనీ బ్లింకెన్ విదేశీ వ్యవహారాల శాఖ దౌత్య సంఘం జరుపుకునే దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి: పద్మభూషణ్ అందుకున్న సత్య నాదెళ్ల.. త్వరలో భారత పర్యటన

ఆసక్తికరంగా బ్రిటన్​ రాజకీయాలు.. రిషి సునాక్​ X బోరిస్​ జాన్సన్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.