ETV Bharat / international

'18ఏళ్లు ఎయిర్​పోర్ట్​లోనే బతికాడు.. స్పీల్​బర్గ్ సినిమాకు కథయ్యాడు.. చివరకు విమానాశ్రయంలోనే..' - ది టెర్మినల్ ప్రేరణ ఇచ్చిన వ్యక్తి అరెస్ట్

సుమారు 18 ఏళ్లు ఆయనకు విమానాశ్రయమే ఇల్లు అయ్యింది. తన వస్తువులను ఎయిర్‌పోర్ట్‌లోని ఓ మూల పెట్టుకుని అక్కడే బతికారు. 1988 నుంచి 2006 వరకు 18 ఏళ్ల పాటు.. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా ఎయిర్‌పోర్ట్‌లోనే జీవించిన వ్యక్తి.. ఇప్పుడు అదే విమానాశ్రయంలోనే మరణించారు. తన అనుభవాలను డైరీలో నిక్షిప్తం చేసుకుంటూ.. పుస్తకాలు చదువుతూ విమానాశ్రయంలో గడిపిన వ్యక్తి చివరికి అక్కడే కన్నుమూశారు. ప్రఖ్యాత దర్శకుడు స్టీఫెన్‌ స్పీల్‌బర్గ్‌ను కదిలించిన మెహ్రాన్‌ కరీమీ నస్సేరి గుండెపోటుతో మరణించారు.

iranian dead in paris airport
మెహ్రాన్‌ కరీమీ నస్సేరి మరణం
author img

By

Published : Nov 13, 2022, 9:05 PM IST

18 ఏళ్ల పాటు పారిస్‌ చార్లెస్ డి గల్లె విమానాశ్రయాన్నే తన నివాసంగా మార్చుకుని.. అక్కడే జీవించిన ఇరాన్‌ జాతీయుడు మెహ్రాన్‌ కరీమీ నస్సేరి ఎయిర్‌పోర్ట్‌లోనే మరణించారు. మెహ్రాన్‌ కరీమీ నస్సేరి గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు పారిస్‌ విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. 18 ఏళ్ల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉన్న ఆయన.. చివరికి అక్కడే మరణించారు. 1988 నుంచి 2006 వరకు 18 ఏళ్ల పాటు నస్సేరి పారిస్‌ విమానాశ్రయంలో జీవించారు. అనంతరం ఆయనను వేరొక ఆశ్రమానికి తరలించారు. అక్కడ ఉంటున్న నస్సేరి విమానాశ్రయానికి వచ్చేవారు. అలా వచ్చిన క్రమంలో గుండెపోటుకు గురైన నస్సేరి.. టెర్మినల్ 2ఎఫ్‌లో తుది శ్వాస విడిచినట్లు విమానాశ్రయ అధికారులు ధ్రువీకరించారు.

సరైన నివాస పత్రాలు లేని కారణంగా 1988లో ఆయనను పారిస్‌లోకి వచ్చేందుకు అధికారులు అనుమతించలేదు. దీంతో ఆయన విమానాశ్రయం టెర్మినల్‌లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కొన్నిరోజుల తర్వాత శరణార్థి పత్రాలు మంజూరైనా.. వాటిపై సంతకం చేయడానికి నస్సేరి నిరాకరించారు. అప్పటి నుంచి.. చార్లెస్‌ డి గల్లే విమానాశ్రయంలోనే ఉండిపోయారు. తన వస్తువులను ఎయిర్‌పోర్ట్‌లోని ఓ మూల పెట్టుకుని అక్కడే పుస్తకాలు చదువుతూ కాలక్షేపం చేసేవారు. ఏరోజుకారోజు తన అనుభవానుల డైరీలో రాసుకుంటూ గడిపారు. ఎక్కువ సమయాన్ని ఆర్థికశాస్త్రం పుస్తకాలను చదవడానికి కేటాయించారు.

నస్సేరి తండ్రి ఇరానియన్‌, తల్లి స్కాటిష్‌. రాజకీయ ఉద్యమాలు చేపట్టడంతో ఆయనను ఇరాన్‌ ప్రభుత్వం జైళ్లో పెట్టింది. తర్వాత కొన్ని రోజులకు ఆయనకు దేశ బహిష్కరణ విధించారు. దీంతో శరణార్థిగా ఉండేందుకు ఎలాంటి పత్రాలు లేకుండా పారిస్‌ చేరుకుని లండన్‌ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా.. అతడిని పోలీసులు పట్టుకుని వెనక్కి పంపారు. ఈయనను ప్రేరణగా తీసుకుని ప్రముఖ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ 2004 లో టామ్‌ హాంక్‌ హీరోగా 'ది టెర్మినల్‌' సినిమాను తెరకెక్కించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.