ETV Bharat / international

చైనా, అఫ్గాన్​ను అతలాకుతలం చేసిన భూకంపం.. భారీ సంఖ్యలో మరణాలు - afghanistan earthquake magnitude

Earth Quake In China : భారీ భూకంపం చైనాను అతలాకుతలం చేసింది. సిచువాన్​ ప్రావిన్సులోని లూడింగ్​కు సుమారు 39 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఈ ఘటనలో దాదాపు 46 మంది మరణించారు. అఫ్గాన్​లో కూడా 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్​లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం.

Earth quake in china afghanistan
Earth quake in china
author img

By

Published : Sep 5, 2022, 2:52 PM IST

Updated : Sep 5, 2022, 10:52 PM IST

Earth Quake In China : చైనాలో భారీ భూకంపం సంభవించింది. సిచువాన్​ ప్రావిన్సులోని లూడింగ్​కు సుమారు 39 కిలోమీటర్ల పరిధిలో ఈ భూకంప కేంద్రం ఏర్పడింది. ఈ భూకంపం కారణంగా ఇప్పటివరకు 46 మంది మరణించారని చైనా అధికార పత్రిక పేర్కొంది. భూకంపం సంభవించిన ప్రాంతానికి సుమారు 226 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిచువాన్​ ప్రావిన్సు రాజధాని చెంగ్డులోనూ భూమి కంపించింది. దీని తీవ్రత 6.8గా నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. 16 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చైనా భూకంప నెట్​వర్క్​ కేంద్రం తెలిపింది. ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి. టిబెట్​ను ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో తరచూ ఇలాంటి భూకంపాలు సంభవిస్తాయని అక్కడి ప్రజలు తెలిపారు.

ఇక్కడే యురేసిన్​, ఇండియన్​ టెక్టానిక్​ పలకలు కలుసుకుంటాయి. అప్పుడప్పుడు చాలా బలంగా ఢీకొంటాయి. అందుకే ఈ ప్రాంతంలో ఎక్కువగా భూకంపాలు సంభవిస్తాయి. ఇదే ప్రావిన్సులో 2008లో కూడా 8.2 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. ఆ విపత్తులో 69 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2013లో 7 తీవ్రతతో భూకంపం వచ్చి 200 మందిని బలితీసుకుంది.
అయితే ఈ ప్రాంతం, ఇప్పటికే పెరుగుతున్న కొవిడ్​ కేసుల వల్ల సతమతమవుతోంది. కేసులు అదుపులోకి తీసుకురావడానికి వరుసగా లాక్​ డౌన్​లు విధిస్తున్నారు. దీంతో పాటు వర్షాలు లేక తీవ్ర కరవు పరిస్థితులను ఎదుర్కొంటోంది.

అఫ్గానిస్థాన్​లో భూకంపం.. ఆరుగురు మృతి
అఫ్గానిస్థాన్​లో కొన్ని ప్రానిన్సుల్లో భూకంపం సంభవించింది. కునార్​ ప్రావిన్సులోని నూర్గుల్​ జిల్లాలో దాదాపు ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. తొమ్మిది మంది గాయపడ్డారు. రిక్టర్​ స్కేల్​పై భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. కునార్​తో పాటు మరికొన్ని ప్రావిన్సుల్లో భూమి కంపించినట్లు సమాచారం. చాలా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో ఇళ్లు నేలమట్టమయ్యాయని అధికారులు తెలిపారు.

అయితే దీనికి భూకంప కేంద్రం తూర్పు నంగర్​హర్​ ప్రావిన్సు రాజధాని జలాలాబాద్​లో 10 కిలోమీటర్ల లోతులో, ఉదయం 2.27 గంటలకు ఏర్పడిందని అమెరికా జియోలాజికల్​ సర్వే తెలిపింది. అఫ్గానిస్థాన్​తో పాటు పాకిస్థాన్​లోని ఇస్లామాబాద్​, రావల్పిండి, పెషావర్​, మార్దాన్​, అబ్బొట్టాబాద్​, స్వాబి, మొహ్మాండ్​, బాజోర్​, బునెర్​ తదితర ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు వచ్చినట్టు ఆ దేశ పత్రిక డాన్​ పేర్కొంది

ఇదీ చదవండి: కెనడాలో వరుస కత్తి దాడులు.. ఆ వర్గమే టార్గెట్.. 10 మంది మృతి

లండన్​లో అదృశ్యమైన కారు పాక్​లో ప్రత్యక్షం.. ఎలా గుర్తించారంటే?

Last Updated : Sep 5, 2022, 10:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.