ETV Bharat / international

నోటి ద్వారా కరోనా టీకా.. పంపిణీ మొదలు పెట్టిన డ్రాగన్‌ దేశం - చైనా కరోనా వ్యాక్సిన్

నోటి ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ను చైనా పంపిణీ చేసింది. ఇప్పటికే పూర్తి మోతాదులో వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి బూస్టర్‌ డోసుగా అందిస్తున్నారు. తొలుత షాంఘై నగరంలో ఈ వ్యాక్సిన్‌ పంపిణీ మొదలుపెట్టారు.

Needle free vaccines by China
నోటి ద్వారా కరోనా టీకా
author img

By

Published : Oct 27, 2022, 9:16 AM IST

సూది అవసరం లేకుండానే కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవడంలో మరో ముందడుగు పడింది. నోటి ద్వారా తీసుకునే కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీని చైనా షురూ చేసింది. షాంఘై నగరంలో పంపిణీ చేస్తోన్న ఈ తరహా వ్యాక్సిన్‌ ప్రపంచంలోనే మొదటిగా భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన కరోనా వ్యాక్సిన్‌లకు కేవలం ఇంజక్షన్‌ ద్వారానే తీసుకునే వీలుంది.

'ఈ వ్యాక్సిన్‌లోని ద్రవాన్ని నోటితో పీల్చాల్సి ఉంటుంది. ఐదు సెకన్ల పాటు ఊపిరి తీసుకోవాలి. ప్రక్రియ మొత్తం 20 సెకన్లలోనే ముగుస్తుంది. దీనిని బూస్టర్‌ డోసుగా పంపిణీ చేస్తున్నాం' అని చైనా అధికారులు వెల్లడించారు. సూదితో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ఇష్టపడని వారికి, పేద దేశాలకు ఇది ఎంతో దోహదపడుతుందని నిపుణులు పేర్కొన్నారు. నోటి ద్వారా తీసుకోవడం వల్ల వైరస్‌ శ్వాస మార్గాల్లోకి వెళ్లకముందే అంతం చేయవచ్చని చెప్పారు.

china started vaccination through mouth
నోటి ద్వారా కరోనా టీకా.. పంపిణీ చేస్తున్న చైనా

చైనా బయోఫార్మా సంస్థ కాన్‌సినో బయోలాజిక్స్‌ ఈ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. వీటి ప్రయోగాలను చైనా, హంగేరీ, పాకిస్థాన్‌, మలేసియా, అర్జెంటీనాతోపాటు మెక్సికో దేశాల్లో పూర్తి చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీనిని బూస్టర్‌ డోసుగా ఉపయోగించేందుకు చైనా ఔషధ నియంత్రణ సంస్థలు సెప్టెంబర్‌లోనే అనుమతి ఇవ్వడంతో తాజాగా వీటి పంపిణీ మొదలుపెట్టారు. ఈ తరహాలో ముక్కు ద్వారా తీసుకునే వీలున్న టీకాలను భారత్‌ ఇప్పటికే అభివృద్ధి చేసినప్పటికీ (భారత్‌ బయోటెక్‌) పంపిణీ మాత్రం ఇంకా మొదలు కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా 12 నాజల్‌ వ్యాక్సిన్లు ప్రయోగ దశల్లో ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

ఇదీ చదవండి: 'మేమూ పరీక్షలు చేస్తాం'.. వైద్య సేవల రంగంపై అదానీ, రిలయన్స్ ఆసక్తి

రిషి సునాక్‌ను అభినందించని పుతిన్‌.. కారణం ఏంటంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.