అఫ్గానిస్థాన్‌లో (Afghanistan news) పరిస్థితులపై చర్చించేందుకు జీ-7 కూటమి దేశాలు(G7 countries) ఈనెల 24న సమావేశం కానున్నట్లు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. అఫ్గాన్ నుంచి స్థానికులతో పాటు ఇతర దేశాల పౌరులను సురక్షితంగా తరలించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
-
I will convene G7 leaders on Tuesday for urgent talks on the situation in Afghanistan. It is vital that the international community works together to ensure safe evacuations, prevent a humanitarian crisis and support the Afghan people to secure the gains of the last 20 years.
— Boris Johnson (@BorisJohnson) August 22, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I will convene G7 leaders on Tuesday for urgent talks on the situation in Afghanistan. It is vital that the international community works together to ensure safe evacuations, prevent a humanitarian crisis and support the Afghan people to secure the gains of the last 20 years.
— Boris Johnson (@BorisJohnson) August 22, 2021I will convene G7 leaders on Tuesday for urgent talks on the situation in Afghanistan. It is vital that the international community works together to ensure safe evacuations, prevent a humanitarian crisis and support the Afghan people to secure the gains of the last 20 years.
— Boris Johnson (@BorisJohnson) August 22, 2021
"అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితులపై అత్యవసర చర్చల కోసం మంగళవారం జీ-7 నాయకుల సమావేశం జరగనుంది. కాబుల్ నుంచి పౌరుల తరలింపు ప్రక్రియ సురక్షితంగా సాగేలా, స్థానికంగా ఏర్పడిన సంక్షోభాన్ని నివారించేలా, 20 ఏళ్లలో అఫ్గాన్ ప్రజలు సాధించిన ప్రగతిని కాపాడేలా.. అంతర్జాతీయ సమాజం కలిసి పనిచేయడం చాలా అవసరం" అని బోరిస్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
జీ-7 కూటమిలో(G7 Summit 2021) అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ దేశాలు సభ్యులుగా ఉన్నాయి.
వర్చువల్‌గా హాజరుకానున్న బైడెన్..
జీ-7 కూటమి సమావేశానికి (G7 Summit) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) వర్చువల్‌గా హాజరుకానున్నట్లు శ్వేతసౌధం మీడియా కార్యదర్శి జెన్ సాకి తెలిపారు. అఫ్గాన్‌లో దిగజారుతున్న పరిస్థితులు, 20 ఏళ్లుగా తమ సైన్యానికి సాయం చేసిన స్థానికులు, బలగాలను సురక్షితంగా వెనక్కి రప్పించే అంశాలపై బైడెన్ చర్చించనున్నట్లు పేర్కొన్నారు. శరణార్థులకు సాయం చేసే అంశంపై చర్చించనున్నట్లు స్పష్టం చేశారు సాకి.
అస్థిరంగానే పరిస్థితులు..
అఫ్గాన్‌ను వీడేందుకు కట్టుబట్టలతో అనేక మంది స్థానికులు కాబుల్ విమానాశ్రయం(Kabul airport) వద్ద గుమిగూడుతున్న నేపథ్యంలో పరిస్థితులు దయనీయంగా మారుతున్నాయి. తొక్కిసలాటలు చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల వల్ల చాలా మంది మరణిస్తున్నారని, ఇంకా అస్థిరంగానే పరిస్థితి ఉందని అమెరికా రక్షణ మంత్రి ఆంటోని బ్లింకెన్ తెలిపారు. విమానాశ్రయం(Kabul airport) గేట్ల వద్ద ప్రజలు గుమిగూడటాన్ని నిర్మూలించేందుకు మార్గాల్ని అన్వేశిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రపంచ దేశాల మద్దతు అవసరం..
అఫ్గానిస్థాన్‌ను ప్రస్తుత పరిస్థితుల నుంచి బయట పడేసేందుకు ప్రపంచ దేశాలు సంయుక్తంగా పనిచేయాలని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి తెలిపారు. ఐరోపా కమిషన్ ఉపాధ్యక్షుడు జోసెప్ బోరెల్తో మాట్లాడిన ఖురేషి ఈ వ్యాఖ్యలు చేశారు.
అఫ్గాన్ ప్రజల హక్కులను రక్షించడమే లక్ష్యంగా పనిచేయాలని ఖురేషి కోరారు. ప్రపంచ దేశాలు అఫ్గాన్ పరిస్థితులను(Afghanistan latest news) నిరంతరం గమనిస్తూ ఉండాలని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: