అఫ్గానిస్థాన్ నుంచి బలగాలు, ఇతర ప్రజల్ని తరలించే ప్రక్రియను ఈనెల 31లోగా పూర్తిచేయాల్సిందేనని అమెరికాకు తేల్చిచెప్పారు తాలిబన్లు. ఈ గడువును పొడిగించే అవకాశాలు ఏమాత్రం లేవని స్పష్టం చేశారు(us military in afghanistan). తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఈమేరకు ఓ ప్రకటన చేశాడు. అఫ్గానిస్థాన్‌లో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటున్నా.. విమానాశ్రయంలో మాత్రం గందరగోళ పరిస్థితులు ఉన్నాయని అన్నాడు(taliban news).
బలగాలు, ప్రజల తరలింపునకు గడువు పొడిగింపుపై తాలిబన్లకు, అమెరికా సీఐఏ ఉన్నతాధికారులకు మధ్య చర్చలు జరిగాయన్న వార్తలపై జబీహుల్లా స్పష్టత ఇవ్వలేదు. ఆ సమావేశం గురించి తనకు తెలియదని చెప్పాడు. అయితే భేటీ జరిగిందన్న వార్తలను మాత్రం ఖండించలేదు.
వారిని తీసుకెళ్లొద్దు
ప్రతిభావంతులు, నైపుణ్యంగల అఫ్గాన్లను తీసుకెళ్లొద్దని అమెరికాకు(us taliban latest news) సూచించాడు జబీహుల్లా. పంజ్‌షేర్ వ్యవహారాన్ని శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తాలిబన్లు కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశాడు.
ఇదీ చూడండి:- భయపడినట్టే అయింది.. ఆ విమానాల్లో విదేశాలకు తాలిబన్లు!