ETV Bharat / international

ఉత్తర అరేబియా సముద్రంలో పాక్​ క్షిపణుల ప్రయోగం

పాకిస్థాన్​ నావికాదళం ఉత్తర అరేబియా సముద్రంలో యాంటీ షిప్​ మిసైల్స్​ను విజయవంతంగా ప్రయోగించినట్లు ఆ దేశ అధికార ప్రతినిధి తెలిపారు. పాక్​ సామర్థ్యం తెలిపేందుకు ఈ ప్రయోగమే నిదర్శనమని నేవీ ప్రధాన అధికారి అడ్మిరల్​ జాఫర్​ మహమ్మద్​ అబ్బాసి పేర్కొన్నారు.

Pakistan Navy successfully test-fires anti-ship missiles
సముద్రంలో పాక్​ క్షిపణి పరీక్షలు
author img

By

Published : Apr 25, 2020, 5:58 PM IST

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారిపై పోరాటం సాగిస్తుంటే... పాక్​ మాత్రం తన యుద్ధ, ఆయుధ సామర్థ్యాన్ని పెంపొందించుకునే పనిలో ఉంది. పాక్ నావికాదళం ఉత్తర అరేబియా సముద్రంలో వరుస యాంటీ షిప్​ మిసైల్స్​ (క్షిపణులు)ను విజయవంతంగా పరీక్షించింది. వీటిని యుద్ధ నౌకలు, విమానాల ద్వారా ప్రయోగించినట్లు పాక్​ నేవీ అధికార ప్రతినిధి తెలిపారు. నావికాదళం ప్రధాన అధికారి​ అడ్మిరల్​ జాఫర్​ మహమ్మద్​ అబ్బాసి సమక్షంలో ఈ పరీక్షలు జరిగినట్లు పేర్కొన్నారు.

పాకిస్థాన్​ నావికాదళ సామర్థ్యానికి, సైనిక సంసిద్ధతకు క్షిపణుల ప్రయోగం ఓ నిదర్శనమని అధికారులు తెలిపారు.

గతేడాది ఆగస్టులో జమ్ముకశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసినప్పటి నుంచి భారత్​- పాక్​ మధ్య సంబధాలు దెబ్బతిన్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే పాక్​ మన దేశంతో దౌత్య సంబంధాలను తగ్గించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.