ETV Bharat / international

మగ దోమలూ మనుషులను చుట్టుముడుతున్నాయ్!

author img

By

Published : Oct 2, 2021, 7:23 AM IST

దోమల రొద చెవినపడగానే మనకు చికాకు కలుగుతుంది. వాటి తాకిడి ఎక్కువగా ఉండే సీజన్లో ఆరు బయటకు వెళ్లామంటే మన చుట్టూ ముసురుకోవడం ఖాయం. అయితే ఇలా చుట్టుముట్టే దోమలన్నీ మనల్ని కుట్టవు. ఆడవి మాత్రమే కుడతాయి. మగవి ఆ పనిచేయవు. (Male Mosquitoes news) అయినా అవి మనుషులను చుట్టుముడతాయని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకు కారణాలను విశ్లేషించారు.

male mosquitoes news
మగ దోమలు

దోమ ఉండటానికి చాలా చిన్నగానే ఉన్నా.. వాటి సామర్థ్యం అమోఘం. మనం వదిలే గాల్లోని కార్బన్‌ డైఆక్సైడ్‌ ఆధారంగా పదుల మీటర్ల దూరంలోనే అది మనల్ని పసిగడుతుంది. కొద్దిసేపట్లోనే మన వద్దకు వచ్చేసి, చర్మంపై వాలుతుంది. సూదిలాంటి ముక్కుతో కాటు వేసి, రక్తాన్ని జర్రుకుంటుంది. ఆడ దోమలు మాత్రమే రక్తాన్ని తాగుతాయి. అందువల్లే అవి డెంగీ, మలేరియా వంటి వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. మగ దోమలు (Male Mosquitoes news) పూలలోని మకరందంపై ఆధారపడి జీవిస్తాయన్నది ఇప్పటివరకూ రూఢీ అయిన విషయం. (Male Mosquito food)

రక్తం తాగకపోయినా మగదోమలు కూడా మనుషుల జోలికి వస్తున్నట్లు మెల్‌బోర్న్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో (Mosquito Melbourne 2021) వెల్లడైంది. అవి మనకు దూరంగా ఉంటాయన్నది అపోహ మాత్రమేనని వారు ప్రయోగపూర్వకంగా నిరూపించారు. వీరు డెంగీని వ్యాప్తి చేసే ఈడిస్‌ ఈజిప్టై జాతిలోని మగ దోమలను ఎంచుకున్నారు. నిర్దిష్ట ప్రాంతంలో వాటిని వదిలారు. అక్కడ కొంతమందిని కుర్చీలో కూర్చోబెట్టారు. దోమల కదలికలను కెమెరాల ద్వారా గమనించారు. ఈ వీడియోలను విశ్లేషించినప్పుడు.. మగ దోమలు కూడా మానవుల పట్ల ఆకర్షణకు గురవుతాయని వెల్లడైంది.

కొందరిపై ఎక్కువ ఆకర్షణ..

ఆడ దోమలు మనుషులందరివైపు ఒకే విధంగా ఆకర్షణకు లోను కావు. మగ దోమల తీరులోనూ ఇలాంటి వైరుధ్యాలు ఉన్నాయి. పరీక్షలో పాల్గొన్న ఒక వ్యక్తి పట్ల మగ దోమలు మూడు రెట్లు ఎక్కువ ఆకర్షణకు లోనైనట్లు వెల్లడైంది. వ్యక్తుల చర్మం నుంచి వెలువడే రసాయనాల మిశ్రమాన్ని బట్టి ఇది మారుతుండొచ్చని వారు విశ్లేషిస్తున్నారు. ల్యాబ్‌లో చిన్నపాటి బోనుల్లో ఉంచి కూడా శాస్త్రవేత్తలు దోమలపై పరీక్షలు నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో.. మగ దోమలు మనుషులపై పెద్దగా ఆసక్తి చూపలేదు. ఆడ దోమలు మాత్రం దూసుకొచ్చాయి. దగ్గర్లోని సంకేతాలను పట్టుకోవడంలో మగ దోమలకు అంత సమర్థత లేకపోవడమే ఇందుకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు.

రక్తం తాగకపోయినా ఎందుకు ఆసక్తి?

రక్తం తాగడానికి కానప్పుడు మగ దోమలు ఎందుకు మానవులపై ఆసక్తి చూపుతున్నాయన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతోంది. ఆడ దోమల జత కోసమే అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.

ఇదీ చదవండి: ఈ కారణాల వల్లే దోమల ఉద్ధృతి... అప్రమత్తత అవసరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.