ETV Bharat / international

Loans for babies: పిల్లల్ని కంటే రూ. 25 లక్షల రుణం.. చైనా కొత్త రూల్!

Loans for babies: జనాభాను పెంచుకోవడమే లక్ష్యంగా చైనా పలు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా వివాహమైన దంపతులకు రుణాలు అందించేందుకు ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టేందుకు జిలిన్‌ ప్రావిన్సు సిద్ధమైంది. ఒక్కో జంటకు రూ. 25 లక్షలు రుణం ఇప్పించే ప్రతిపాదన రూపొందించింది.

china
చైనా
author img

By

Published : Dec 25, 2021, 5:30 AM IST

Loans for babies: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన చైనాలో గతకొంత కాలంగా జనాభా రేటు తగ్గిపోతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడిస్తోంది. ఇలా కొనసాగితే రానున్న కొన్నేళ్లలోనే యువ జనాభా శాతం తగ్గిపోగా.. వృద్ధుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతోంది. దీంతో మొన్నటివరకు 'ఒక్కరు ముద్దు-అసలే వద్దు' నినాదాన్ని పక్కనబెట్టి.. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనండంటూ ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా 'బేబీ లోన్‌' పేరుతో ఏకంగా రూ.25 లక్షల వరకూ బ్యాంకు రుణం ఇప్పించేందుకు చైనాలోని జిలిన్‌ ప్రావిన్సు సిద్ధమయింది.

జనాభాను పెంచుకునే ఉద్దేశంలో భాగంగా చైనా పలు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా వివాహమైన దంపతులకు రుణాలు అందించేందుకు ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని మొదలుపెట్టేందుకు జిలిన్‌ ప్రావిన్సు సిద్ధమైంది. వివాహమైన దంపతులకు 2 లక్షల యువాన్లు (దాదాపు రూ.25లక్షలు) రుణం ఇప్పించే ప్రతిపాదన రూపొందించింది. అయితే, ఈ సహాయం ఏ రూపంలో ఇస్తుందని విషయాన్ని మాత్రం వెల్లడించనప్పటికీ.. పిల్లల సంఖ్యను బట్టీ వడ్డీరేట్లలో భారీ డిస్కౌంట్‌ ఇచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు, ముగ్గురు పిల్లలున్న దంపతులు ఏదైనా వ్యాపారం చేస్తే పన్నులో మినహాయింపు ఇవ్వనున్నట్లు ఆ ప్రతిపాదనలో పేర్కొంది. అంతేకాకుండా ప్రసూతి సెలవులను కూడా ఆరు నెలలకు పెంచడంతో పాటు పురుషులకు పితృత్వ సెలవులను పెంచనున్నట్లు అందులో పేర్కొంది.

Loans for babies in China:

గడిచిన కొన్నేళ్లుగా చైనా జనాభా రేటు గణనీయంగా తగ్గుతోంది. ముఖ్యంగా జిలిన్‌ ప్రావిన్సుల్లో జనాభా రేటు భారీగా క్షీణిస్తున్నట్లు అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. పిల్లల సంఖ్యపై ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలను పెట్టనప్పటికీ కుటుంబ ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో ఎంతోమంది దంపతులు పిల్లల్ని కనేందుకు వెనుకాడుతున్నారు. అయితే, తాజాగా జిలిన్‌ ప్రావిన్సు అధికారుల ప్రతిపాదనపై అక్కడి సామాజిక మాధ్యమాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 'ఇప్పటికే తీసుకున్న రుణాల చెల్లింపుల్లో ఇబ్బంది పడుతుంటే కొత్తగా ఇప్పడు బేబీ లోన్‌ వచ్చింది. కేవలం బ్యాంకుల చెల్లింపులకే మా జీవితం మొత్తం పనిచేయాల్సి వస్తుంది' అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఈ మధ్యే బ్యాంక్‌ ఆఫ్‌ చైనా కూడా చిన్న పిల్లలున్న దంపతుల కోసం ఓ కొత్త రుణ సదుపాయాన్ని అందుబాటులోకి తేగా.. దానిపైనా విమర్శలు వచ్చాయి. దీంతో మేల్కొన్న ఆ బ్యాంక్‌ ప్రజల నుంచి ఏవిధమైన స్పందన వస్తుందో తెలుసుకునేందుకే ఈ స్కీమ్‌ మొదలుపెట్టామని.. డిమాండ్‌ లేకపోవడంతో ఆ సదుపాయాన్ని పక్కనబెట్టినట్లు ప్రకటించింది.

ఇదీ చదవండి:

బైడెన్​ కీలక నిర్ణయం- ఆ దేశాలపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేత

క్రిస్​మస్​ ప్రయాణాలపై ఒమిక్రాన్​ దెబ్బ.. వందల విమానాలు రద్దు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.