ETV Bharat / international

చైనాలోనే కొవిడ్‌ నకిలీ టీకా రాకెట్‌ సూత్రధారి!

నకిలీ కరోనా టీకాలను విదేశాలకు స్మగ్లింగ్​ చేస్తున్న ఓ ముఠా సూత్రధారి చైనాలో పట్టుబడ్డాడు. అతడు ఏకంగా 58 వేల నకిలీ టీకా సమ్మేళనాలను సృష్టించినట్లు గుర్తించారు అధికారులు. గత ఏడాది నవంబర్​లో 600 బ్యాచ్‌ల నకిలీ వ్యాక్సిన్‌ను హాంకాంగ్‌కు పంపినట్లు తెలిసింది.

author img

By

Published : Feb 17, 2021, 5:17 AM IST

Fake vaccine in China
చైనాలో నకిలీ కరోనా టీకా ముఠా

నకిలీలు, చౌకబారు వస్తువుల ఉత్పత్తికి చైనా మారుపేరు. ఇక మహమ్మారి కొవిడ్‌ మూలాలు ఇక్కడే ఉన్నాయనే అపకీర్తినీ ఈ దేశం మూటకట్టుకుంది. ఈ నేపథ్యంలో అనేక మిలియన్ డాలర్ల విలువైన నకిలీ కరోనా టీకా కుంభకోణానికి సూత్రధారి కూడా ఆ దేశంలోనే పట్టుబడటం గమనార్హం.

కాంగ్‌ అనే పేరున్న ఈ ఘరానా మోసగాడు నిజమైన వ్యాక్సిన్ల ప్యాకేజింగ్‌, డిజైన్లను బాగా పరిశోధించాడు. అనంతరం ఏకంగా 58 వేల నకిలీ టీకా సమ్మేళనాలను సృష్టించాడు. టీకా ఔషధానికి బదులుగా మినరల్‌ వాటర్‌, సెలైన్‌ ద్రావణం ఆ సీసాల్లో నింపేవాడట. వీటిని సముద్రమార్గంలో విదేశాలకు స్మగ్లింగ్ చేసేవాడు. ఈ విధంగా గత ఆగస్టు నుంచి చేస్తున్నట్టు తెలిసింది. గత నవంబర్‌లో 600 బ్యాచ్‌ల నకిలీ వ్యాక్సిన్‌ను హాంకాంగ్‌కు పంపాడు. ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్‌ బృందం 2.78 మిలియన్ డాలర్లు ఆర్జించింది. అయితే ఈసారి వాటిని ఎక్కడకు పంపాలనుకున్నదీ తెలియరాలేదు.

ఈ నకిలీ టీకాలను ఆస్పత్రులకు అత్యధిక ధరలకు విక్రయించేవారు. ఇక వీటిని చేజిక్కించుకున్న కొంతమంది, తామే స్వయంగా టీకా కార్యక్రమాలను నిర్వహించటం గమనార్హం. మరి కొందరు గ్రామీణ డాక్టర్లు, ఈ నకిలీ వ్యాక్సిన్లను ప్రజల కార్లు, ఇళ్ల వద్దకే వెళ్లి అందచేసి డబ్బు చేసుకునేవారు. నకిలీ టీకాలకు సంబంధించిన నేరాలకు గానూ చైనాలో ఇప్పటికి 70 మందికి పైగా అరెస్టయ్యారు. ఈ విధమైన చర్యలను అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలంటూ చైనా అత్యున్నత న్యాయస్థానం పిలుపునిచ్చిందంటే.. పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.

ఇదీ చూడండి:పడవ ప్రమాదంలో 60 మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.