ETV Bharat / international

ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయంతో ఆందోళనలో చైనా! - తైవాన్​కు బలగాలను పంపించిన ట్రంప్​

ట్రంప్‌(Donald Trump News) మూర్ఖుడు.. వాచాలత్వం ఎక్కువ.. తిక్క నిర్ణయాలు.. ఇలా వెక్కిరించిన వారంతా ఒక్క విషయంలో ఆయన్ని మెచ్చుకొంటారు. చైనాతో ఎలా వ్యవహరించాలో అమెరికాకు నేర్పించారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన ఓ పని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇది తెలుసుకొన్న చైనాకు గొంతులో తడారిపోయింది! డ్రాగన్‌ను అంత ఆందోళనకు గురిచేసిన ట్రంప్‌ నిర్ణయం ఏమిటో తెలుసా..?

Us Troops In Taiwan
తైవాన్​లో అమెరికా బలగాలు
author img

By

Published : Oct 10, 2021, 12:46 PM IST

తైవాన్​ను(China Taiwan News) ఆక్రమించేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్న చైనాకు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump News) తన హయాంలో తీసుకున్న ఓ నిర్ణయం.. ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. తైవాన్‌కు అమెరికా సైన్యాన్ని(Us Troops In Taiwan) గతంలో ట్రంప్(Donald Trump News) ​ పంపించారు. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఇటీవల ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. ఈ విషయం తెలుసుకొన్న చైనా గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది.

తైవాన్‌ సైన్యానికి శిక్షణ..!

అమెరికాకు చెందిన ఒక స్పెషల్‌ ఆపరేషన్స్‌ యూనిట్‌ సైనికులు, ఒక గ్రూపు మెరైన్స్‌ సిబ్బంది దాదాపు ఏడాది నుంచి తైవాన్‌లో ఉంటున్నారు. వీరు అక్కడి సైనికులకు, మెరైన్‌ సిబ్బందికి యుద్ధవ్యూహాలపై శిక్షణ ఇస్తున్నారు. వీరిలో డజను మంది కమాండోలు, గుర్తుతెలియని సంఖ్యలో మెరైన్లు ఉన్నారు. కొన్నేళ్లుగా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌ దూకుడు పెరిగిపోవడం, తైవాన్ ఎయిర్‌ డిఫెన్స్‌ జోన్‌లోకి విమానాలను పంపడం వంటి దౌర్జన్యపూరిత చర్యలతో అమెరికా ఈ నిర్ణయం తీసుకొంది. ట్రంప్‌(Donald Trump News) హయాంలో కమాండోలను తైవాన్‌కు పంపించారు. ప్రస్తుతం వారు అక్కడ పనిచేస్తున్నారా..? లేదా..? అన్న విషయం బయటకు వెల్లడికాలేదు. కానీ, మెరైన్స్‌ మాత్రం ఇప్పటికీ అక్కడే ఉన్నట్లు సమాచారం.

ఇప్పుడెందుకు బయటకొచ్చింది..

గత వారం దాదాపు 50కి పైగా చైనా విమానాలు తైవాన్‌ గగనతల రక్షణ జోన్‌లోకి ప్రవేశించాయి. వీటిల్లో న్యూక్లియర్‌ బాంబర్లు, ఫైటర్‌ జెట్‌లు, ట్యాంకర్లు ఉన్నాయి. అదే సమయంలో ఈ వార్త బయటకి పొక్కింది. ఇప్పటి వరకు కొన్నేళ్లు తైవాన్‌తో చెలగాటం ఆడి.. ఆ తర్వాత తేలిగ్గా ఆక్రమించుకోవచ్చనుకున్న చైనాకు ఇదో పెద్ద షాక్‌. వాస్తవానికి చైనా వచ్చే ఆరేళ్లలో తైవాన్‌ను ఆక్రమించుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇటీవల అమెరికా జనరల్స్‌ ఓ కాంగ్రెస్‌ కమిటీ విచారణలో అంగీకరించారు. తైవాన్‌లోకి సైన్యాన్ని(Us Troops In Taiwan) పంపిన అంశంపై మాట్లాడేందుకు తాజాగా పెంటగాన్‌ తిరస్కరించింది. అటు తైవాన్‌ కూడా పెదవి విప్పలేదు. ట్రంప్‌ హయాంలో పెంటగాన్‌లో పనిచేసిన క్రిస్టఫర్‌ మాయర్‌ మాత్రం అమెరికా కాంగ్రెస్‌ విచారణలో మాట్లాడుతూ తైవాన్‌కు సైన్యాన్ని పంపే ప్రతిపాదనను బలంగా పరిశీలించామని పేర్కొన్నారు.

మరోవైపు చైనా మాత్రం నీతులు వల్లించడం మొదలుపెట్టింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతూ గతంలో చేసుకొన్న ఒప్పందాలను అమెరికా గౌరవించాలని, తైవాన్‌కు సైనిక సాయాన్ని నిలిపివేయాలని కోరారు. "తమ సార్వభౌమత్వాన్ని, భూభాగాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం" అని పేర్కొన్నారు.

అప్పటి వరకు చైనాను ఎదుర్కొనేలా..!

యుద్ధ సన్నద్ధత అనేది కేవలం గంటల్లో జరిగే పనికాదు. హఠాత్తుగా జరిగే దండయాత్రలను ఎదుర్కోవడం దాదాపు అసాధ్యం. అందుకే దాడిలో ప్రత్యర్థులను దిగ్భ్రాంతికి గురిచేయడం చాలా ముఖ్యం. చైనా-తైవాన్‌కు మధ్య దూరం కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే. అంటే మన హైదరాబాద్‌- కోదాడ కంటే తక్కువ దూరమన్నమాట. చైనా దళాలు వాయు, జల మార్గాల్లో ఈ దూరాన్ని దాటి తైవాన్‌లో ప్రవేశించడం అత్యంత తేలిక. అదే సమయంలో జపాన్‌లోని ఓకినావాలో ఉన్న అమెరికా సైన్యం(Us Troops In Taiwan) అక్కడికి చేరే లోపే చైనా ఆక్రమణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. పోనీ తైవాన్‌లో అమెరికా సైన్యాన్ని(Us Troops In Taiwan) నేరుగా ఉంచడం సాధ్యంకాదు. ఎందుకంటే చైనాతో అమెరికా వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి. అందుకనే తైవాన్‌ సైన్యాన్నే బలోపేతం చేస్తే.. వారే తొలి దాడిని సమర్థంగా ఎదుర్కొంటారు..! ఈ లోపు మిత్రపక్షాలు రంగంలోకి దిగేందుకు తగినంత సమయం లభిస్తుంది.

అమెరికా వ్యూహం ఇలా..!

తైవాన్‌ 2000-2015 వరకు రక్షణ రంగాన్ని బాగా విస్మరించింది. కేవలం అత్యంత ఖరీదైన ఆయుధాలు మాత్రమే కొనుగోలు చేసింది. ఇవి ఆ దేశాన్ని ఏమాత్రం కాపాడలేవని అమెరికా సైనికాధికారులు అంచనా వేస్తున్నారు. దళాల్లో పోరాట పటిమను, వ్యూహరచన సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టిపెట్టాలని చెబుతున్నారు. వాస్తవానికి చైనాతో యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే ఈ ఖరీదైన పరికరాలు మొత్తం ధ్వంసం అవుతాయని ట్రంప్‌ హయాంలో డిప్యూటీ నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌గా పనిచేసిన మ్యాట్‌ పొటింగర్‌ పేర్కొన్నారు. ఆయన హార్వర్డు విశ్వవిద్యాలయంలోని హూవర్‌ ఇన్‌స్టిట్యూషన్‌లో పరిశోధకుడు. ఆయన అంచనా ప్రకారం.. తైవాన్‌ను కాపాడేవి నౌకా విధ్వంసక క్షిపణులు, స్మార్ట్‌ సీ మైన్స్‌, సుశిక్షుతులైన రిజర్వు, సహాయ దళాలు మాత్రమే. ఇవి చైనాను భారీగా దెబ్బతీయగలవని మ్యాట్‌ అంచనా వేశారు. ముఖ్యంగా చైనా దళాలు భూమిపై, జలాల్లో ప్రయాణించే యాంఫీబియూస్‌ వాహనలను వాడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పలు వ్యూహాలను ఎదుర్కొనేలా శిక్షణ ఇవ్వాలన్నది అమెరికా ప్లాన్‌.

ట్రంప్‌తో తైవాన్‌కు బలం..

అమెరికా-తైవాన్‌ సంబంధాలను కఠినంగా నియంత్రించే చట్టాలను ట్రంప్‌ అధికారం చేపట్టాక సడలించారు. ట్రంప్‌ ఆఫీస్‌ను వీడటానికి కొన్ని రోజుల ముందే 10 పేజీల ఇండో-పసిఫిక్‌ వ్యూహ పత్రాన్ని విడుదల చేశారు. ఇందులో తైవాన్‌తో సంబంధాలను, చైనాతో ముప్పును అమెరికన్లకు తెలియజేశారు. ముప్పులను స్వయంగా ఎదుర్కొనేలా తైవాన్‌ను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

దీంతో ఆయన తర్వాత శ్వేతసౌధంలో అడుగుపెట్టేవారు.. తప్పనిసరిగా తైవాన్‌ను కాపాడాల్సిన పరిస్థితి కల్పించారు. ఆ తర్వాత బైడెన్‌ సర్కారు ఈ వ్యూహంలో ఇప్పటి వరకు ఎటువంటి మార్పులు చేయలేదు. వీటిల్లో కొన్ని విధానాలను కొనసాగిస్తోంది. ఏప్రిల్‌లో ఓ బృందాన్ని కూడా తైవాన్‌కు పంపింది. అంటే ఇప్పుడు రొమ్ము విరుచుకొని తైవాన్‌పైకి వెళ్లాలంటే చైనా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.