ETV Bharat / international

Covid 19: ఆ దేశాన్ని వెంటాడుతోన్న కొవిడ్‌ మరణాలు! - రష్యాలో కరోనా విజృంభణకు కారణాలు?

వివిధ దేశాల్లో కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ రష్యాలో మాత్రం మహమ్మారి మరణాలు విపరీతంగా పెరిగాయి. బుధవారం ఒక్కరోజే 929 కొవిడ్‌ మరణాలు నమోదు కాగా.. వరుసగా రెండోరోజు 924 మంది మృత్యువాతపడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

russia covid
russia covid
author img

By

Published : Oct 8, 2021, 7:59 AM IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ను ఎదుర్కొనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడంతో పలు దేశాల్లో వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టింది. దీంతో ఆయా దేశాలు కొవిడ్‌ ఆంక్షలు సడలిస్తున్నాయి. ఇదే సమయంలో మరోదఫా కొవిడ్‌ ఉద్ధృతితో పలు దేశాలు సతమతమవుతున్నాయి. తాజాగా రష్యాలో కరోనా వైరస్‌ ఉద్ధృతి ఒక్కసారిగా పెరిగింది. గతకొన్ని రోజులుగా నిత్యం 900మంది మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాది రోజువారీ కొవిడ్‌ మరణాల్లో ఇవే అత్యధికం. వ్యాక్సిన్‌ పంపిణీ మందకొడిగా కొనసాగడం, చాలా ప్రాంతాల్లో కొవిడ్‌ ఆంక్షలు పాటించకపోవడంతోనే రష్యాలో వైరస్‌ విజృంభణ ఒక్కసారిగా పెరగడానికి కారణాలని వైద్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు.

రష్యాలో గత రెండురోజులుగా కొవిడ్‌ మరణాలు విపరీతంగా పెరిగాయి. బుధవారం ఒక్కరోజే 929 కొవిడ్‌ మరణాలు నమోదు చేసుకోగా.. వరుసగా రెండోరోజు 924 మంది మృత్యువాతపడినట్లు క్రెమ్లిన్‌ అధికారులు వెల్లడించారు. యూరప్‌లో అత్యధిక మరణాలు రష్యాలోనే చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు అక్కడ 2,13,000 మంది కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోయారు. అయితే, వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువగానే ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇక రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య 27వేల కేసులు నమోదు చేసుకోగా.. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య కాస్త తక్కువగానే ఉన్నప్పటికీ మరణాల సంఖ్య అధికంగా ఉండడం ఆందోళన కలిగించే విషయమని ఆరోగ్యరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మందకొడి వ్యాక్సినేషన్​తోనే..

సెప్టెంబర్‌ నెల నుంచి రష్యాలో కొవిడ్‌ కేసులు, మరణాల సంఖ్యలో పెరుగుదల కనిపించింది. ఇందుకు వ్యాక్సిన్‌ పంపిణీ మందకొడిగా సాగడమే కారణమని అక్కడి అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో తొలి వ్యాక్సిన్‌ను రిజిస్టర్‌ చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా.. పంపిణీలో మాత్రం ఇతర దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడిపోయింది. మొత్తం 14కోట్లు పైచిలుకు ఉన్న రష్యా జనాభాలో ఇప్పటివరకు కేవలం 33శాతం మందికి కనీసం ఒక్కడోసు మాత్రమే అందించారు. రష్యా మొత్తం జనాభాలో కేవలం 29శాతం మాత్రమే రెండు డోసుల్లో వ్యాక్సిన్‌ తీసుకున్నారు.

మరోసారి ఆంక్షలు..

గతకొన్ని రోజులుగా వైరస్‌ ఉద్ధృతి పెరగడంతో పలు ఆస్పత్రుల ముందు అంబులెన్సులు క్యూ కడుతున్న దృశ్యాలు రష్యన్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. చాలా ఆస్పత్రుల్లో 95శాతం పడకలు నిండిపోయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తాజాగా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు స్థానికంగా ఆంక్షలు విధించే పనిలో నిమగ్నమయ్యారు. థియేటర్లు, రెస్టారంట్లతోపాటు మరికొన్ని ప్రాంతాలకు కేవలం వ్యాక్సిన్‌ తీసుకున్న వారినే అనుమతిస్తున్నారు. లేదా కొవిడ్‌ నెగటివ్‌ ఉన్న రిపోర్టు చూపెట్టడాన్ని తప్పనిసరి చేస్తున్నారు. ఇదిలాఉంటే, రష్యా కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు అక్కడ 77లక్షల కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 2,13,549 మరణాలు చోటుచేసుకున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.