ETV Bharat / international

చిన్నారులకు కొవిడ్‌ టీకా- క్యూబా సర్కార్​ సాహసం

చిన్నారులకు కరోనా టీకా ఇవ్వడంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలోనే రెండేళ్ల పైబడిన పిల్లలకు టీకాలు వేస్తూ షాక్​కు గురి చేస్తోంది క్యూబా. మరే దేశం మీదా ఆధారపడకుండా సొంతంగా సాబరినా, అబ్దాలా అనే కొవిడ్‌ టీకాలను తయారుచేసుకొని సామూహిక టీకా కార్యక్రమం చేపట్టింది.

cuba child vaccine
కరోనా టీకా
author img

By

Published : Sep 20, 2021, 6:45 AM IST

చిన్నారులకు పోలియో, ఆటలమ్మ వంటి వ్యాధులు సోకకుండా టీకాలు వేయడం ప్రపంచమంతటా ఉన్నదే. క్యూబా ఈ నెల ఆరో తేదీ నుంచి రెండేళ్ల పిల్లలకూ కొవిడ్‌ టీకాలు వేయనారంభించడం ప్రపంచాన్ని విస్మయపరచింది. పసి పిల్లలకు కొవిడ్‌ టీకాలు ఇవ్వడం భద్రమేనా అనే ప్రశ్నలు తలెత్తాయి. ప్రపంచ ఆరోగ్యసంస్థ సమ్మతి ఇంకా లభించకపోయినా క్యూబా రెండు నుంచి 18 ఏళ్ల పిల్లలకు టీకా కార్యక్రమాన్ని చేపట్టింది. ఒక కోటీ పది లక్షల జనాభా ఉన్న కమ్యూనిస్టు దేశం క్యూబా- మరే దేశం మీదా ఆధారపడకుండా సొంతంగా సాబరినా, అబ్దాలా అనే కొవిడ్‌ టీకాలను తయారుచేసుకొని సామూహిక టీకా కార్యక్రమం చేపట్టింది. దక్షిణ అమెరికా ఖండంలో మొట్టమొదట సొంత కొవిడ్‌ టీకాను తయారుచేసిన ఘనత క్యూబాది. ఈ ఖండంలోని ఇతర దేశాలు- చైనా, అమెరికా, బ్రిటన్‌ టీకాల మీద ఆధారపడుతున్నాయి. కొవిడ్‌ వల్ల నిరుడు మార్చి నుంచి మూతపడిన పాఠశాలలను ఈ అక్టోబరు నుంచి మళ్లీ తెరిపించడానికే క్యూబా పిల్లలకూ టీకాలు వేయడం మొదలుపెట్టింది. ఇంతకాలం క్యూబా విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులే శరణ్యమైనా, ఇంటర్నెట్‌ సౌకర్యం లేక అత్యధిక కుటుంబాల పిల్లలు చదువులో వెనకబడిపోతున్నారు. టీకాలిచ్చే భద్రతతో వారు పాఠశాలలకు తిరిగి రావాలని ప్రభుత్వం లక్షిస్తోంది.

డెల్టా విజృంభణతో..

ప్రపంచంలో అనేక దేశాలు 12 ఏళ్లు, అంతకు పైబడినవారికి టీకాలు వేస్తున్నాయి తప్ప క్యూబాలాగ మరీ రెండేళ్ల పిల్లలకు ఇవ్వడంలేదు. అమెరికాతోపాటు ఫ్రాన్స్‌, జర్మనీ వంటి ఐరోపా దేశాలు 12-15 ఏళ్ల వయసు పిల్లలకు కొవిడ్‌ టీకాలు ప్రారంభించాయి. బ్రిటన్‌ చాలాకాలం తర్జన భర్జన తరవాత ఇటీవలే ఈ వయసు పిల్లలకు టీకాలను అనుమతించింది. చిలీ ఆరేళ్లకు పైబడిన వారికి టీకాలు వేస్తుంటే, చైనా మూడేళ్ల పిల్లలకు టీకాలు అందిస్తోంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ త్వరలో మూడేళ్ల పిల్లలకు కొవిడ్‌ టీకాలను అనుమతించనున్నది. చిలీ, ఎమిరేట్స్‌- చైనా టీకాలను వాడుతున్నాయి. భారత్‌లో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థలు 12 ఏళ్లకన్నా తక్కువ వయసు పిల్లలకు టీకాలిచ్చే విషయమై క్లినికల్‌ ప్రయోగాలు జరుపుతున్నాయి. ఈ నేపథ్యంలో క్యూబా రెండేళ్ల పిల్లలకూ టీకాలు వేయడం మిగతా ప్రపంచానికి ఆసక్తి కలిగిస్తోంది. ఈ టీకా కార్యక్రమ ఫలితాల కోసం ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అమెరికా ప్రేరణతో ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధించినందువల్ల క్యూబా సొంతంగా టీకాలను రూపొందించుకొంది. అవి 90శాతం సామర్థ్యంతో పనిచేస్తాయని ప్రకటించింది. నిరుడు క్యూబా ప్రభుత్వం కొవిడ్‌ కేసులను సమర్థంగా నియంత్రించగలిగినా ఇటీవల కేసులు పెరుగుతున్నాయి. క్యూబాలో ఇప్పటి వరకు 6,90,000 కొవిడ్‌ కేసులు నమోదైతే, వాటిలో మూడో వంతు గత నెలలోనే రికార్డయ్యాయి. కేసులు ఒక్కసారిగా పెరగడంతో ఆక్సిజన్‌కు, పడకలకు తీవ్ర కొరత ఏర్పడింది. మొదట వైద్య సిబ్బందికి, పిల్లలకు టీకాలను ప్రారంభించిన క్యూబా- ఇటీవల డెల్టా విజృంభణ వల్ల చిన్న పిల్లల్లోనూ కొవిడ్‌ కేసులు పెరగడంతో రెండేళ్ల చిన్నారులకూ టీకా కార్యక్రమం చేపట్టింది. నవంబరుకల్లా 90శాతం జనాభాకు టీకాలు పూర్తి చేసి దేశ సరిహద్దులను మళ్ళీ తెరుస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొవిడ్‌ వల్ల క్యూబా పర్యాటక రంగం తీవ్రంగా నష్టపోయింది. అంతర్జాతీయ వాణిజ్యమూ దెబ్బతింది. మరోవైపు సొంతంగా టీకాలు ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం ఉన్న దేశాలు తమ బాగు తాము చూసుకుంటూ ఉంటే, పేద దేశాల్లోని వందల కోట్ల జనాభాకు కనీసం ఒక్క డోసూ పడటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాపోతోంది. సంపన్న దేశాలు తమ దృష్టిని బూస్టర్‌ డోసులు, బాలలకు టీకాల నుంచి పేద దేశాలపైకి మళ్ళించాలని కోరుతోంది.

భారత్‌లో ప్రయోగాలు

పెద్దలకు కొవిడ్‌ టీకా కార్యక్రమాన్ని శరవేగంగా పూర్తిచేయాలని లక్షిస్తున్న భారతదేశం, 12-17 ఏళ్ల మధ్య వయసులో ఏవైనా వ్యాధులతో బాధపడుతున్నవారికి అక్టోబరు నుంచి టీకాలు వేయాలని భావిస్తోంది. 12 ఏళ్ల లోపు పిల్లలకు బహుశా వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో టీకా కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారత్‌లో 18 ఏళ్ల లోపు పిల్లల జనాభా 44 కోట్లు. దేశ జనాభాలో 94 కోట్ల మందికి టీకాలు వేసిన తరవాతే ఆరోగ్యవంతులైన పిల్లలకు టీకాలు వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జైడస్‌ క్యాడిలా సంస్థ 12-17 ఏళ్ల పిల్లలపై, భారత్‌ బయోటెక్‌ 2-17 ఏళ్ల పిల్లలపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరుపుతున్నాయి. జైడస్‌ క్యాడిలాకు ప్రభుత్వ అనుమతి లభించినందువల్ల అక్టోబరు నుంచి బాలలకు టీకాలు వేయడానికి సన్నద్ధమవుతోంది. 5-18 ఏళ్ల పిల్లలపై బయొలాజికల్‌ ఇ సంస్థ కోర్బివ్యాక్స్‌ ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ టీకా డిసెంబరుకల్లా అందుబాటులోకి రావచ్చు. అమెరికన్‌ సంస్థ నోవావ్యాక్స్‌తో కలిసి సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేస్తున్న కోవో వ్యాక్స్‌ టీకానూ పిల్లలకు ప్రయోగాత్మకంగా వేస్తున్నారు. బాలలకూ టీకాలు వేస్తేగానీ కొవిడ్‌ను తట్టుకునే సామూహిక రోగ నిరోధక శక్తిని (హెర్డ్‌ ఇమ్యూనిటీని) సాధించలేమని నిపుణులు పేర్కొంటున్నారు.

- కైజర్‌ అడపా

ఇదీ చూడండి: చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ షురూ.. 2-10 ఏళ్ల వారికి...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.