ETV Bharat / international

అది కరోనా కాదు... చైనీస్​ 'కుంగ్​ ఫ్లూ': ట్రంప్​

ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేస్తోన్న కరోనా వైరస్​ వ్యాప్తికి చైనానే కారణమని మరోసారి ఉద్ఘాటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. వైరస్​ను చైనీయుల యుద్ధ కళతో పోల్చుతూ 'కుంగ్​ ఫ్లూ' గా అభివర్ణించారు.

Trump again blames China for COVID-19
కరోనా కాదు అదీ చైనీస్​ 'కుంగ్​ ఫ్లూ' : ట్రంప్​
author img

By

Published : Jun 21, 2020, 12:40 PM IST

Updated : Jun 21, 2020, 3:11 PM IST

ప్రపంచవ్యాప్తంగా 4లక్షల 60వేల మందికిపైగా ప్రాణాలను బలిగొని.. 89లక్షల మందిని అనారోగ్యానికి గురిచేసిన కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనానే కారణమని మరోమారు ఆరోపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. కరోనా వైరస్​ను చైనీస్​ యుద్ధ కళతో పోల్చుతూ 'కుంగ్​ ఫ్లూ'గా అభివర్ణించారు.

అగ్రరాజ్యంలో కరోనా విజృంభణ తర్వాత ఒక్లహోమాలోని టల్సాలో నిర్వహించిన తొలి ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్.

" కరోనాను కుంగ్​ ఫ్లూ అని పిలుస్తా. మరో 19 రకాల పేర్లు కూడా పెట్టగలను. చాలా మంది దాన్ని వైరస్​ అని, ఫ్లూ అని పిలుస్తున్నారు. తేడా ఏముంది? దానికి 20 రకాల పేర్లున్నాయి. "

-ఎన్నికల ర్యాలీలో డొనాల్డ్ ట్రంప్​.

కరోనా వైరస్​ చైనాలోని వుహాన్​లోనే ఉద్భవించిందని మొదట్నుంచి ఆరోపిస్తున్నారు ట్రంప్. వైరస్​ వ్యాప్తి డిసెంబరుకు ముందే మొదలైనప్పటికీ ప్రపంచానికి తెలియకుండా చైనా దాచిందని చాలా సార్లు చెప్పారు. కరోనాను చైనీస్ వైరస్, వుహాన్​ వైరస్ అని రకరకాల పేర్లతో పిలిచారు.

కరోనా కారణంగా అమెరికానే అత్యంత తీవ్రంగా ప్రభావితమైంది. ఇప్పటివరకు ఆ దేశంలో 23లక్షల మందికి వైగా వైరస్​ బారినపడ్డారు. లక్షా 21వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

నవంబరులో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి గెలవాలనే తాపత్రయంతో ఉన్నారు ట్రంప్​. అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు, డెమొక్రాటిక్​ పార్టీ అభ్యర్థి జో బిడెన్​ నుంచి గట్టి పోటీ ఎదుర్కోనున్నారు. కరోనా ప్రభావం, నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్​ మృతి, నిరుద్యోగం వంటి ప్రధాన అంశాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి.

ఇదీ చూడండి: హెచ్​1బీ వీసాల రద్దుపై 2 రోజుల్లో నిర్ణయం!

Last Updated : Jun 21, 2020, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.