ETV Bharat / international

చైనాతో వాణిజ్య చర్చల్లో గొప్ప పురోగతి :ట్రంప్​ - వాణిజ్య యుద్ధం

చైనాతో వాణిజ్య చర్చల్లో గొప్ప పురోగతి సాధించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ వెల్లడి

US-CHINA
author img

By

Published : Feb 1, 2019, 11:16 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చైనా ప్రతినిధులతో రెండు రోజుల పాటు వైట్​హౌజ్​లో సమావేశమయ్యారు. చర్చల్లో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందంపై గొప్ప పురోగతి సాధించినట్లు ట్రంప్​ తెలిపారు. ఇంకా జరగాల్సిన ప్రక్రియ చాలా ఉందని స్పష్టం చేశారు.

మార్చి 1లోపు ఇరు దేశాల మధ్య పరస్పర అంగీకారం కుదరకపోతే చైనా వస్తువులపై అమెరికా విధించబోయే సుంకంలో ఎలాంటి మార్పు ఉండబోదని ట్రంప్​ మరోమారు తేల్చిచెప్పారు.

ప్రతినిధుల ద్వారా ట్రంప్​కు ప్రత్యేక లేఖను పంపారు చైనా అధ్యక్షుడు జిన్​పింగ్.

'చైనా-అమెరికా మధ్య సంబంధాలు కీలక దశలో ఉన్నాయి. ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకుసాగుతాయని ఆశిస్తున్నా.'
-లేఖలో జిన్​పింగ్

చర్చల్లో అమెరికా-చైనా మధ్య సాంకేతిక రంగంలో తలెత్తిన సమస్యలు, సైబర్ నేరాలు వంటి కీలక విషయాలను ప్రస్తావించినట్లు శ్వేతసౌధం తెలిపింది.

ఇరు దేశాల మధ్య తుది ఒప్పందానికి ఈ చర్చలు కీలకమవుతాయని అమెరికా సెనేటర్​ జెర్రీ మొరాన్​ ఆశాభావం వ్యక్తం చేశారు.

New Delhi, Feb 01 (ANI): Piyush Goyal arrived at the Ministry of Finance on Friday. He will present interim Budget 2019-20 in the Parliament today. With the Lok Sabha elections only a few months away, Finance Minister Piyush Goyal will present NDA government's Interim Budget on Friday amidst a lot of hopes and expectations from across the spectrum of society-right from the common people to industries. The Interim Budget is the last financial exercise by Prime Minister Narendra Modi led Central government before the General Elections, will be presented in the Lok Sabha by Finance Minister Goyal on Friday at 11 am.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.