ETV Bharat / international

టిక్​టాక్​పై నిషేధాన్ని అడ్డుకోవాలని కోర్టుకు వినతి - అమెరికాలో టిక్​టాక్​ నిషేధం వార్తలు

ట్రంప్ ప్రభుత్వం తమ యాప్‌ను నిషేధించే ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చైనాకు చెందిన టిక్‌టాక్.. ఫెడరల్​ న్యాయమూర్తిని కోరింది. ట్రంప్ ఆదేశాలు చట్ట విరుద్ధమని, జాతీయ భద్రత పేరుతో తమపై నిషేధం విధించలేరని పేర్కొంది. తమ వీడియో షేరింగ్ యాప్​ను ఒరాకిల్, వాల్‌మార్ట్‌తో బలవంతంగా ఒప్పందం కుదుర్చుకోలేమని తెలిపింది.

tiktok
టిక్​టాక్
author img

By

Published : Sep 24, 2020, 8:23 AM IST

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని అడ్డుకోవాలని న్యాయమూర్తిని కోరింది చైనాకు చెందిన టిక్​టాక్​ సంస్థ. ట్రంప్ కార్వనిర్వాహక ఆదేశాలు చట్ట విరుద్ధమని ఆరోపించింది. జాతీయ భద్రత చట్టం కింద ఈ నిర్ణయం తీసుకునే అధికారం అధ్యక్షుడికి లేదని తెలిపింది.

ట్రంప్ ఆదేశాలపై న్యాయ సమీక్ష కోరుతూ కొలంబియాలోని ఫెడరల్​ కోర్టును ఆశ్రయించింది టిక్​టాక్​. ట్రంప్ ఆదేశాలు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, హక్కులు కాలరాసినట్టేనని ఆరోపించింది ఈ చైనా సంస్థ. ఒరాకిల్​, వాల్​మార్ట్​తో ఒప్పందం చేసుకునేలా ఒత్తిడి తెస్తున్నారంటూ వివరించింది.

ఆగస్టు ఆదేశాలు..

జాతీయ భద్రతకు ముప్పు ఉందని చైనాకు చెందిన టిక్​టాక్​, వీచాట్ యాప్​లపై నిషేధం విధిస్తూ ఆగస్టులో ట్రంప్ కార్వనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. టిక్​టాక్​ యూఎస్‌ కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా.. అమెరికా కంపెనీకి విక్రయించాలని ఇందులో స్పష్టం చేశారు. లేదంటే వేటు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు.

ఆ తర్వాత టిక్​టాక్​ కొనుగోలుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపించగా బైట్‌డ్యాన్స్‌ అంగీకరించలేదు. ఒరాకిల్​- బైట్​డాన్స్​ చర్చలు సానుకూలంగా సాగిన నేపథ్యంలో ట్రంప్ సూచనలతో టిక్​టాక్​ నిషేధానికి జారీ చేసిన ఆదేశాల గడువు పొడిగించింది అమెరికా వాణిజ్య విభాగం.

నవంబర్​లో సమగ్ర నిషేధం..

ఇంతకు ముందు ఆదేశాల ప్రకారం ఆదివారం నుంచి టిక్​టాక్​ కొత్త డౌన్​లోడ్లను అమెరికాలో నిలిపియాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ గడువును సెప్టెంబర్ 27 వరకు పొడిగించింది. ఇది అమలైతే నవంబర్​ నుంచి టిక్​టాక్​పై పూర్తిస్థాయి నిషేధం ఉంటుంది.

ఇదీ చూడండి: ట్రంప్‌ నిర్ణయంపై టిక్‌టాక్‌ దావా- న్యాయపోరుకు సిద్ధం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.