ETV Bharat / international

మనవరాలి కోసం మోడల్​గా మారిన బామ్మ - 99 year old Woman Modelling latest

వృద్ధాప్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితమవుతుంటారు. కానీ 99 ఏళ్ల బామ్మ.. మేకప్​ వేసుకుని మోడలింగ్ చేస్తోందంటే మీరు నమ్ముతారా? తొమ్మిది పదుల వయసులోనూ ఎంతో చలాకీగా బ్యూటీ ప్రొడక్ట్స్​కు మోడల్​గా వ్యవహరిస్తోంది. మరి ఈ వయసులో బామ్మ.. మోడలింగ్ వైపు రావటానికి గల కారణాలేంటో తెలుసుకుందామా..?

99 year old Woman
బామ్మ
author img

By

Published : Aug 6, 2021, 9:40 PM IST

అమెరికాకు చెందిన 99ఏళ్ల బామ్మ.. మేకప్​ వేసుకుని మోడలింగ్ చేస్తున్నారు. తన మనవరాలి మేకప్ ఉత్పత్తులను ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ఇప్పుడు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నారు. బామ్మ మోడలింగ్ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

99 year old Woman
మోడల్​గా మారిన బామ్మ

మనవరాలి కోసం..

అమెరికా, కాలిఫోర్నియాకు చెందిన హెలేన్ సిమోన్​(99).. తన మనవరాలు లాన్సీ క్రొవెల్.. నిర్వహిస్తున్న సాయ్ బ్యూటీ ఉత్పత్తులకు మోడలింగ్​ చేస్తున్నారు​. తాను మోడల్​ను అవుతానని జీవితంలో ఎప్పుడూ అనుకోలేదని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. జీవితంలో ఎన్నడూ మేకప్ వేసుకోలేదన్నారు. తన మనవరాలి ప్రోత్సాహం వల్లే ఈ వయసులోనూ మోడలింగ్ ప్రారంభించానని తెలిపారు.

తెల్ల డ్రెస్​ వేసుకుని.. చేతిలో పూలతో ఉన్న సిమోన్ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది. అత్యంత పెద్ద వయస్కురాలైన మోడళ్లలో ఒకరిగానూ పేరు తెచ్చుకున్నారు సిమోన్​. మొదట బామ్మను ఒప్పించటం ఏంతో కష్టమైందని సిమోన్.. మనవరాలు లాన్సీ క్రొవెల్ వివరించారు. తర్వాత మెల్లగా ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు.

సిమోన్​కు ఆరుగురు పిల్లలు, 11 మంది మనవరాళ్లు, ఆరుగురు మునిమనవళ్లు ఉన్నారు.

ఇదీ చదవండి: 'మతి' పోగొడుతున్న కాలుష్యం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.