కరోనా నియంత్రణ దిశగా లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో వీడియో కాల్ ద్వారా పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తోంది దక్షిణాఫ్రికా . అయితే సమావేశం మధ్యలో అనుకోకుండా జరిగిన ఓ పరిణామం సభ్యులకు ఇబ్బంది కలిగించింది. అశ్లీల చిత్రాలు మధ్యలో పోస్ట్ చేశారు హ్యాకర్లు. ఆ దేశ అసెంబ్లీ స్పీకర్ థాండి మొడిసె లక్ష్యంగా జాత్యాంహకార, లింగవివక్షతతో కూడిన పోస్టులు చేశారు.
కరోనా నియంత్రణ దిశగా దక్షిణాఫ్రికా పార్లమెంట్‌ను భౌతికంగా నిలిపేసింది సిరిల్ రామఫోసా ప్రభుత్వం. పార్లమెంట్ సమావేశాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే నిర్వహిస్తోంది. అనుకోని ఘటన పట్ల షాక్ తిన్న ఛైర్పర్సన్ మొడిసె.. వీడియో సమావేశాలకు 'జూమ్' సరైన వేదిక కాదని తాను ముందే హెచ్చరించినట్లు చెప్పుకొచ్చారు. అయితే.. మరో లింక్ ద్వారా సమావేశాలను కొనసాగించారామె.
సులభ లక్ష్యంగా 'జూమ్'..
అభ్యంతరకర పోస్టులతో సమావేశాలకు అంతరాయం కలిగిస్తోందని జూమ్‌పై ఇప్పటికే విమర్శలు ఉన్నాయి. కరోనా కారణంగా వినియోగదారులు ఎక్కువగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో జూమ్ హ్యాకర్లకు సులభ లక్ష్యంగా మారుతోందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: ప్రపంచంపై కరోనా 2.0 విలయతాండవం సృష్టించనుందా?