ETV Bharat / international

సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చిన 27 మృతదేహాలు

Migrant bodies in sea: ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు సహా మొత్తం 27 మంది మృతదేహాలు.. సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. మృతులంతా ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వలసదారులుగా తెలుస్తోంది. లిబియాలో ఈ ఘటన వెలుగు చూసింది.

Migrant bodies in sea
సముద్రంలో మృతదేహాలు
author img

By

Published : Dec 26, 2021, 8:47 PM IST

Updated : Dec 26, 2021, 10:11 PM IST

Migrant bodies in sea: సముద్రం ఒడ్డుకు 27 మృతదేహాలు కొట్టుకురావడం కలకలం రేపింది. పశ్చిమ లిబియాలో ఈ ఘటన వెలుగు చూసింది. మృతుల్లో ఓ చిన్నారి, ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా ఐరోపాకు చెందిన వలసదారులేనని ఆ దేశానికి చెందిన రెడ్​ క్రెసెంట్ సంస్థ వెల్లడించింది.

Libya boat mishaps: ఖోమ్స్​ పట్టణంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో శనివారం రాత్రి ఈ మృతదేహాలు కనిపించాయి. మరో ముగ్గురిని సిబ్బంది రక్షించారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మేరకు రెడ్​ క్రెసెంట్​ సంస్థ కొన్ని ఫొటోలను షేర్ చేసింది. మధ్యధరా సముద్రంలో మృతదేహాలు తేలుతున్నట్లుగా ఆ ఫొటోల్లో కనిపించాయి. వాటిని కొంతమంది నల్లటి బ్యాగుల్లో అమర్చే దృశ్యాలు కనిపించాయి.

Migrant bodies in sea
సముద్రం ఒడ్డుకు కొట్టుకువచ్చిన మృతదేహాలు
Migrant bodies in sea
మృతదేహాలను నల్లటి బ్యాగులో పెట్టిన దృశ్యం

libya migrant crisis: మృతులంతా లిబియాలో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన వలసదారులేనని తెలుస్తోంది. లిబియా రాజధాని ట్రిపోలీలో వలసదారులపై అధికారులు అణచివేతను భరించలేక చాలామంది లిబియా నుంచి ఐరోపాకు పడవల్లో అక్రమంగా వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో పడవ మునక ప్రమాదాల్లో అనేక మంది చనిపోతూ ఉంటారు.

మధ్యధరా సముద్రంలో జరిగిన వివిధ పడవ ప్రమాదాల్లో ఈ ఏడాది దాదాపు 1,500 మంది వలసదారులు మృతి చెందారని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ తెలిపింది. ఈ నెల ప్రారంభంలో జరిగిన రెండు వేర్వేరు పడవ మునక ప్రమాదంలో 160 మంది వలసదారులు మరణించారని పేర్కొంది.

ఇదీ చూడండి: Suicide Bomb Blast: కాంగోలో ఆత్మాహుతి దాడి- ఆరుగురు మృతి

ఇదీ చూడండి: క్రిస్​మస్​ ప్రయాణాలపై ఒమిక్రాన్​ దెబ్బ.. వందల విమానాలు రద్దు

Last Updated : Dec 26, 2021, 10:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.