ETV Bharat / entertainment

రూ.200 కోట్ల క్లబ్​లో విజయ్​ 'వారిసు' - అజిత్ 'తునివు'.. ఎవరు ముందున్నారంటే? - విజయ్​ వారసుడు 200 కోట్ల కలెక్షన్స్​

సంక్రాంతికి భారీ అంచనాలతో రిలీజైన విజయ్​ 'వారిసు', అజిత్​ 'తునివు' చిత్రాలు బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తున్నాయి. అయితే ఈ రెండు చిత్రాలు ఇప్పటివరకు ఎంత సాధించాయంటే..

Vijay Varisu Ajith Tunivu boxoffice collections

author img

By

Published : Jan 18, 2023, 2:53 PM IST

ఇండస్ట్రీలో సంక్రాంతి సినిమాల జాతర ఇంకా కొనసాగుతోంది. తెలుగులో వీరసింహా రెడ్డి-వాల్తేరు వీరయ్య(జనవరి 13న విడుదల) బరిలో దిగగా తమిళనాట అజిత్‌ తునివు(తెగింపు), విజయ్‌ వారీసు(వారసుడు) బాక్సాఫీస్‌ వద్ద పోటీపడుతున్నాయి. అయితే ఈ రెండు తమిళ సినిమాలు జనవరి 11న గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే. బాక్సాఫీస్‌ దగ్గర ఈ ఇద్దరు స్టార్‌ హీరోలు నువ్వానేనా అన్న రీతిలో పోటీపడ్డారు. వారం రోజుల్లోనే ఈ రెండు సినిమాలు రెండు వందల కోట్లకు పైగా వసూలు చేశాయి. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థలు ప్రకటించాయి.

ఇప్పటివరకు వారసుడు ప్రపంచవ్యాప్తంగా రూ. 210 కోట్లు కలెక్ట్​ చేసినట్లు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు తునివు కూడా సుమారు రూ.250 కోట్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఓవర్సీస్‌లోనూ ఈ రెండు సినిమాలు వసూళ్లు అదరగొట్టాయి. కాగా తొమ్మిదేళ్ల తర్వాత అజిత్‌, విజయ్‌ సినిమాలు ఒకేరోజు రిలీజ్‌ అయ్యాయి. దీంతో వీరిద్దరిలో ఎవరు ఎక్కువ వసూళ్లు సాధిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

'వారిసు'ను ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో టాలీవుడ్‌ దర్శకుడు వంశీ పైడిపల్లి వారిసును తెరకెక్కించారు. రష్మిక కథానాయిక. ఈ సినిమాలో హీరో సోదరులుగా సీనియర్‌ హీరో శ్రీకాంత్‌, కిక్‌ శ్యామ్‌ నటించారు. శరత్‌కుమార్‌, జయసుధ, ప్రకాశ్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక తునివు విషయానికొస్తే.. స్టైలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు హెచ్‌. వినోద్‌. రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఐవీవై ప్రొడక్షన్స్ కలిసి ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. మంజు వారియర్ కథానాయిక.

  • #Thunivu 7 Days Box Office

    👉Tamilnadu : ₹149.7 CR
    👉Andhra & Nizam : ₹6 Cr
    👉Kerala : ₹7.50 Cr
    👉Karnataka : ₹12.63 Cr
    👉Rest of India : ₹7.5 Cr
    👉Overseas : ₹66 Cr

    Total Worldwide Gross : ₹ 249.33* CRS

    Note: Hindi version yet to release.

    — TN Theatres Association (@TNTheatres_) January 18, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: ఇండియాలో నేనే డిక్టేటర్​.. కానీ హాలీవుడ్​లో అడుగుపెట్టాలంటే కన్ఫ్యూజన్​: రాజమౌళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.