ETV Bharat / entertainment

'బిచ్చగాడు-2' స్నీక్​ పీక్​ ట్రైలర్.. బ్రెయిన్ ట్రాన్స్​ప్లాంటేషన్.. కొత్త కాన్సెప్ట్..

విజయ్​ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో వస్తున్న చిత్రం బిచ్చగాడు-2. పార్ట్-​1 సక్సెస్​తో ఉత్సాహంగా ఉన్న విజయ్​..​ ఈ ఏడాది సమ్మర్​లో సీక్వెల్​తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. టీజర్​, ట్రైలర్​కు భిన్నంగా ఈ సినిమా స్నీక్ ​పీక్​ ట్రైలర్​ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్​ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.

Bichagadu 2 movie Sneak Peek Trailer
Bichagadu 2 movie Sneak Peek Trailer
author img

By

Published : Feb 10, 2023, 6:33 PM IST

Updated : Feb 10, 2023, 7:37 PM IST

విజయ్​ ఆంటోనీ నటించిన 'బిచ్చగాడు' సినిమా సంచలనం సృష్టించింది. సాధారణ సినిమాగా విడుదలై 100 రోజులకు పైగా ప్రేక్షకులను అలరించింది. డిఫరెంట్​ కాన్సెప్ట్​తో వచ్చిన విజయ్​.. బాక్సాఫీసు మందు కలెక్షన్ల వర్షం కురిపించారు. ఈ సూపర్​ హిట్ చిత్రానికి సీక్వెల్​గా 'బిచ్చగాడు 2' తెరకెక్కిస్తున్నారు. విజయ్​ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో.. ఆయన కథానయకుడిగా నటిస్తున్న ఈ సీక్వెల్‌ వేసవిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని సరికొత్తగా ప్రారంభించింది. టీజర్‌, ట్రైలర్‌లకు భిన్నంగా.. 'స్నీక్‌ పీక్‌ ట్రైలర్‌' అంటూ సినిమా ఓపెనింగ్‌ సన్నివేశాన్ని విడుదల చేసింది.

ఈ స్నీక్‌ పీక్‌ ట్రైలర్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ఎప్పుడూ ప్రయోగాలు చేయడంలో ముందు వరుసలో ఉండే విజయ్​.. ఇప్పుడు మరో మెట్టు ఎక్కి ఈ చిత్రాన్ని వినూత్న కాన్సెప్ట్​తో తెరకెక్కించారని తెలుస్తోంది. స్నీక్​పీక్​ ట్రైలర్​ ప్రకారం.. 'బ్రెయిన్ ట్రాన్స్​ప్లాంట్​' ఆధారంగా రూపొందుతున్నట్లు కనిపిస్తోంది. చివరలో డబ్బు లోకాన్ని ఖాలీ చేస్తోంది అంటూ పవర్​ ఫుల్​ మెసేజ్​ ఇచ్చారు. దీంతో, ఈ ట్రైలర్​ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచింది. అయితే, కిడ్నీ, గుండె లాంటి అవయవాలను ట్రాన్స్​ప్లాంట్లు ఇప్పటికే జరుగుతున్నాయి. కానీ ఈ బ్రెయిన్​ ట్రాన్స్​ప్లాంట్​ అనేది ప్రస్తుతం ప్రయోగాల దశలోనే ఉంది. ఇలాంటి సైన్స్​ ఫిక్షన్​ కథలను హాలీవుడ్​లోనే ఎక్కువగా చూస్తాం. కానీ ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్​తోనే విజయ్​ బిచ్చగాడు2 సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా గురించి పూర్తిగా తెలియాలంటే విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ​

ఈ చిత్ర షూటింగ్​ సమయంలోనే విజయ్​ ఆంటోనీ గాయపడ్డారు. జనవరిలో మలేషియాలో జరిగిన బిచ్చగాడు 2 సినిమా చిత్రీకరణలో ఆయన ప్రమాదానికి గురయ్యారు. దీంతో విజయ్​ దవడ, ముక్కు భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. సర్జరీ తర్వాత తన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు విజయ్​ తెలిపారు. కాగా, ఈ సినిమాను విజయ్​ ఆంటోనీ ఫిల్మ్​ కార్పోరేషన్​ సంస్థ ఆధ్వర్యంలో ఫాతిమా విజయ్​ ఆంటోనీ నిర్మిస్తున్నారు. కథ, దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్​ విభాగాలన్నీ విజయ్​ ఆంటోనీ చూసుకుంటున్నారు. ఈ చిత్రంలో కావ్య తపర్, రాధా రవి, యోగి బాబు, జాన్​ విజయ్​, హరిష్​ పేరడి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Last Updated : Feb 10, 2023, 7:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.