Vijay Antony Daugther Suicide : కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ కుమార్తె మీరా ఆత్మహత్య యావత్ సినీ ప్రపంచాన్ని కలిచివేసింది. 16 ఏళ్ల వయసులో ఆ యువతి కన్నుమూయడం దిగ్భ్రాంతికర విషయం అని సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. చదువు ఒత్తిడి వల్లేనని బయట కథనాలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తదుపరి విచారణను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంతో గతంలో విజయ్ ఆంటోనీ సూసైడ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
అప్పుడు తండ్రి ఇప్పుడు కూతురు..
Vijay Antony Father : గతంలో విజయ్ ఓ ఈవెంట్లో తన గతం గురించి చెప్పుకొచ్చారు. తనకు ఏడేళ్ల వయసున్నప్పుడే తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నారని.. అప్పుడు తన అమ్మ కష్టపడి పిల్లల్ని పెంచి పెద్ద చేశారంటూ భావోద్వేగానికి లోనయ్యారు. జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా.. సూసైడ్ మాత్రం చేసుకోవద్దంటూ చెప్పుకొచ్చారు. "నాకు 7 ఏళ్ల వయసునప్పుడు నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత మా అమ్మ.. నన్ను నా చెల్లిని ఎంతో కష్టపడి పెంచారు. ఆ బాధ నాకు తెలుసు. నేను లైఫ్‌లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాను" అని విజయ్ అన్నారు.
-
He Lost his dad at 7 [commited suicide]
— Troll Mafia (@offl_trollmafia) September 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Now Lost his daughter [Commited Suicide]
Why is God so cruel to a kind-hearted person like #VijayAntony? 💔 pic.twitter.com/olUMtYUpLi
">He Lost his dad at 7 [commited suicide]
— Troll Mafia (@offl_trollmafia) September 19, 2023
Now Lost his daughter [Commited Suicide]
Why is God so cruel to a kind-hearted person like #VijayAntony? 💔 pic.twitter.com/olUMtYUpLiHe Lost his dad at 7 [commited suicide]
— Troll Mafia (@offl_trollmafia) September 19, 2023
Now Lost his daughter [Commited Suicide]
Why is God so cruel to a kind-hearted person like #VijayAntony? 💔 pic.twitter.com/olUMtYUpLi
ఇక ఈ వీడియోతో పాటు మరో వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో మనుషుల్లో వచ్చే సూసైడల్ ఆలోచనల గురించి చెప్పుకొచ్చారు. అంతే కాకుండా చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి తేకుండా వారిని ఫ్రీగా వదిలేయాలంటూ వ్యాఖ్యానించారు. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు? ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయన్న విషయంపై మాట్లాడారు. "ఎవరినైనా ఎక్కువగా నమ్మి మోసపోయినప్పుడు అలా చేస్తుంటారు. చిన్న పిల్లలకు అయితే చదువు విషయం వల్ల వచ్చే ఒత్తిడితో సూసైడ్ థాట్స్ వస్తాయి. స్కూల్ నుంచి వచ్చాక పిల్లల్ని ట్యూషన్‌కు పో అక్కడికి ఇక్కడికిపో అంటాం. వాళ్లని సొంతంగా ఆలోచించనివ్వడం లేదు. మన చుట్టు పక్కల వాళ్ల వల్లే మనం కూడా అలా చేస్తున్నాం. పిల్లలను కాస్త ఫ్రీగా వదిలేయాలి" అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్ విజయ్ కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నారు. ధైర్యంగా ఉండమంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మరోవైపు సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలిపారు.
-
"Pasangala Freeyavidunga..❤️" - #VijayAntony @vijayantony #Galatta pic.twitter.com/4884fcDmcU
— Galatta Media (@galattadotcom) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">"Pasangala Freeyavidunga..❤️" - #VijayAntony @vijayantony #Galatta pic.twitter.com/4884fcDmcU
— Galatta Media (@galattadotcom) September 15, 2023"Pasangala Freeyavidunga..❤️" - #VijayAntony @vijayantony #Galatta pic.twitter.com/4884fcDmcU
— Galatta Media (@galattadotcom) September 15, 2023
బిచ్చగాడు-2 షూటింగ్లో ఘోర ప్రమాదం.. విజయ్ ఆంటోనీకి తీవ్ర గాయాలు
'తీవ్ర గాయాల నుంచి బయటపడ్డా.. త్వరలోనే మీతో మాట్లాడతా'.. విజయ్ ఆంటోని ట్వీట్