Varun Lavanya Marriage : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న మూడు మూళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు. ఇటలీలోని టస్కానీ వేదికగా ఈ వివాహ వేడుక గ్రాండ్‌గా జరగనుంది. ఇప్పటికే వధూవరులతో పాటు మెగా కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. అయితే మెగాఫ్యామిలీలో ప్రధానమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి ఈ పెళ్లికి హాజరు కావటం లేదని సమాచారం. ఆరోగ్య సమస్య కారణంగా వైద్యుల సూచనల మేరకు ఆమె ఇంట్లో ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహ వేడుకను ఇంటి దగ్గర నుంచే ప్రత్యక్షంగా చూసే విధంగా చిరంజీవి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు అందరికంటే ముందుగా రామ్ చరణ్-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ఇటలీ చేరుకున్నారు. ఆ తర్వాత అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో వెళ్లారు. ఇలా రామ్ చరణ్, బన్నీ ఇద్దరూ కలిసి వరుణ్ పెళ్లి ఏర్పాట్లను చేస్తున్నారు. ఇక అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు తమ సోషల్ మీడియా ద్వారా లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉపాసన కూడా ఓ గ్రాండ్ ఫ్యామిలీ ఫొటోను షేర్ చేశారు. అందులో మెగా, కామినేని ఫ్యామిలీలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సందడి చేశాయి. చిన్నారి క్లీంకార కూడా ఆ ఫొటోలో కనిపించింది. ఇక వరుణ్ తేజ్, లావణ్య కూడా ఒకరి ఫోటలు ఒకరు షేర్ చేశారు.
Varun Lavanya Wedding : ఇక వివాహ విషయానికొస్తే.. పెళ్లి వేడుక నాలుగు రోజులు పాటు జరగనుంది. అక్టోబర్ 30న రాత్రి సంగీత్ పార్టీ, అక్టోబర్ 31న ఉదయం హల్దీ, సాయంత్రం మెహందీ వేడుకలకు ప్లాన్ చేశారు. నవంబర్ 1న పెళ్లి జరగనుంది. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, అత్యంత సన్నిహితులు, స్నేహితులు హాజరుకానున్నారట. ఇక పెళ్లి అనంతరం నవంబర్ 5న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నారు. అయితే పెళ్లికి హాజరు కానీ సినీ, రాజకీయ ప్రముఖుల ఈ రిసెప్షన్‌కు హాజరుకానున్నారని సమాచారం.
-
Varun & Lavanya jet off to Italy for the wedding 😍#varuntej #lavanyatripathi #varunlav #varuntejmarriage pic.twitter.com/r4Bwq3VtLz
— Navya (@Navya07_) October 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Varun & Lavanya jet off to Italy for the wedding 😍#varuntej #lavanyatripathi #varunlav #varuntejmarriage pic.twitter.com/r4Bwq3VtLz
— Navya (@Navya07_) October 27, 2023Varun & Lavanya jet off to Italy for the wedding 😍#varuntej #lavanyatripathi #varunlav #varuntejmarriage pic.twitter.com/r4Bwq3VtLz
— Navya (@Navya07_) October 27, 2023
Varun Lavanya Marriage : ఇటలీ బయల్దేరిన పవన్, అల్లు అర్జున్ ఫ్యామిలీ.. ఫొటోలు వైరల్!