ETV Bharat / entertainment

ఫుల్​ ఫన్​, రొమాంటిక్​గా 'ఊర్వశివో రాక్షసివో' ట్రైలర్​.. 'హరోం హర' అంటున్న హీరో సుధీర్​ బాబు - ఊర్వశివో రాక్షసివో సినిమా అప్డేట్లు

Movie Updates: అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన కొత్త చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మరోవైపు, సుధీర్​బాబు నటిస్తున్న 'హరోం హర' చిత్రానికి సంబంధించి హీరో ఫస్ట్​ లుక్, టైటిల్​ వీడియో రిలీజ్​ చేశారు మేకర్స్​. వాటిని మీరూ చూసేయండి.

urvasivo rakshasivo movie trailer and sudheer babu haromhara title video released

author img

By

Published : Oct 31, 2022, 12:01 PM IST

Urvasivo Rakshasivo Movie Trailer: అల్లు శిరీష్‌, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా నటించిన కొత్త చిత్రం 'ఊర్వశివో రాక్షసివో'. రాకేశ్‌ శశి దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. మధ్య తరగతి, సంప్రదాయ కుటుంబానికి చెందిన అబ్బాయి.. ఓ ట్రెండీ అమ్మాయితో ప్రేమలో పడటం.. ఆమెను పెళ్లి చేసుకోవడానికి అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సిద్ధమైనట్లు ట్రైలర్‌ చూస్తే తెలుస్తోంది.

శిరీష్‌, అను మధ్య వచ్చే లవ్‌ సీన్స్‌, వెన్నెల కిషోర్‌ కామెండీ టైమింగ్‌తో ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. "తను కొరియన్‌ వెబ్‌సిరీస్‌లా ట్రెండీగా ఉంటే నువ్వెంట్రా 'కార్తికదీపం' సీరియల్‌లో డాక్టర్‌బాబు, వంటలక్కలా పేజీలు పేజీలు డైలాగ్స్‌ చెబుతున్నావ్‌", "ఇన్ని ఈ.ఎమ్‌.ఐలు ఉన్నావాడు ఏ అమ్మాయి గురించి ఆలోచించకూడదురా. అది బేసిక్స్‌" అంటూ వెన్నెల కిషోర్‌ వేసే పంచులు నవ్వులు తెప్పించేలా ఉన్నాయి. గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ సమర్పణలో ఈ సినిమా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Sudheer Babu Haromhara First Look: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నారు హీరో సుధీర్​బాబు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం 'హరోం హర'. జ్ఞాన్​సాగర్​ దర్శకుడు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ వీడియోను విడుదల చేశారు సుధీర్ బాబు. ఫస్ట్​లుక్​, టైటిల్ వీడియోను ఆకట్టుకునేలా డిజైన్ చేశారు మేకర్స్.

వీడియోలో ముందుగా జగదాంబ టాకీస్ థియేటర్​లో సూపర్ స్టార్ కృష్ణ సినిమా 'అగ్నిపర్వతం' అడుతున్నట్టు, థియేటర్​లో ఆ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఉన్నట్లు చూపించారు. తర్వాత ఓ డైలాగ్ వస్తుంది. "సుబ్రహ్మణ్యం నీ కోసం జనాలు చూస్తున్నారు, అలా కనబడకుండా ఉంటే ఎలా చెప్పు" డైలాగ్​కు.. హీరో "ఇంక చెప్పేదేమీ లేదు చేసేదే" అని చెప్పిన డైలాగ్ ఆసక్తిగా ఉంది. వీడియోలో హీరో ఓ వైపు తుపాకీ, మరో చేత్తో సుబ్రమణ్య స్వామి ఆయుధాన్ని పట్టుకున్నట్లు చూపించారు. సినిమాలో హీరో క్యారెక్టర్ పేరు సుబ్రహ్మణ్యం అని క్లియర్​గా తెలుస్తోంది. కుప్పం నియోజకవర్గం గురించి కూడా ప్రత్యేకంగా చూపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.