ETV Bharat / entertainment

'మిషన్ ఇంపాజిబుల్' సీక్వెల్స్​ రిలీజ్ డేట్స్ ఇవే!

author img

By

Published : Apr 30, 2022, 7:14 AM IST

Tom cruise Mission Impossible: హాలీవుడ్ యాక్షన్ హీరో టామ్ క్రూజ్​ నటించిన 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్​కు ఉన్న క్రేజ్​ అంతా ఇంతా కాదు. అయితే.. ఈ ప్రాంచైజీ నుంచి విడుదల కావాల్సిన మిషన్ ఇంపాజిబుల్ 7, 8 సీక్వెల్స్​కు తాజాగా టైటిళ్లను ఖరారు చేశారు. ఇక రిలీజ్​ డేట్ వివరాలు కూడా తెలిపారు.

Tom cruise Mission Impossible
టామ్​ క్రూజ్​ మిషన్ ఇంపాజిబుల్​ 7

Tom cruise Mission Impossible: టామ్‌ క్రూజ్‌ హీరోగా నటించిన 'మిషన్‌: ఇంపాజిబుల్‌' చిత్రాలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ఆరు చిత్రాలు రాగా.. అవన్నీ బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడీ సిరీస్‌లో వరుసగా రెండు చిత్రాలు రానున్నాయి. ఇప్పటికే ఏడో భాగానికి సంబంధించిన చిత్రీకరణ పూర్తికాగా.. ఎనిమిదో భాగం శరవేగంగా షూటింగ్‌ జరుగుతోంది.

ఈ రెండు చిత్రాలకు 'మిషన్‌ ఇంపాజిబుల్‌ 7 - డెడ్‌ రికనింగ్‌:పార్ట్‌ 1', 'మిషన్‌ ఇంపాజిబుల్‌ 7 - డెడ్‌ రికనింగ్‌:పార్ట్‌ 2' అనే టైటిళ్లను ఖరారు చేసింది చిత్ర బృందం. ఈ విషయాన్ని హీరో టామ్‌ క్రూజ్‌ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారు. 'డెడ్‌ రికనింగ్‌: పార్ట్‌1' వచ్చే ఏడాది జులై 14న విడుదల కానుండగా.. తర్వాతి భాగం 2024 జూన్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రిస్టోఫర్‌ మెక్‌క్వారీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాల్ని.. పారామౌంట్‌ పిక్చర్స్‌ సంస్థ సమర్పిస్తోంది.

ఇదీ చూడండి: యమ హాట్​గా అమీ జాక్సన్​.. కియారా అందాల ఆరబోత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.