'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులరయ్యారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. దీని తర్వాత ఏ సినిమా చేయనున్నారన్న విషయంపై అభిమానుల్లో సస్పెన్స్ నెలకొంది. కానీ దిని గురించి ఎక్కడా అనౌన్స్మెంట్ రాలేదు. బన్నీ కూడా దీని గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు నిర్మాత బన్నీవాస్ ఓ గుడ్‌న్యూస్ చెప్పారు. తాజాగా '2018' సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న బన్నీవాస్.. అల్లు అర్జున్ తదుపరి చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యాలు చేశారు.
'పుష్ప ది రూల్' సినిమా తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రానుందని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ 2024లో ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ డ్రామా జోనర్లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిపారు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్‌తో కలిసి సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించబోతున్నట్లు బన్నీవాస్ ప్రకటించారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు.
ఇప్పటికే హ్యాట్రిక్ హిట్... అయితే ఇప్పటికే అల్లు అర్జున్-త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో వచ్చిన 'జులాయి', 'సన్ ఆఫ్ సత్యమూర్తి', 'అల వైకుంఠపురంలో' సినిమాలు బ్లాక్ బస్టర్‌గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అందుకున్నాయి. 'అల వైకుంఠపురంలో అయితే నార్త్ ఆడియెన్స్‌ను బాగా ఆకట్టుకుంది. దీంతో వీరిద్దరి కలయికలో నాలుగో చిత్రం రానుందని బన్నీవాస్ చేసిన ప్రకటనతో అల్లు అర్జున్ అభిమానుల ఆనందానికి అవధులు లేకండా పోయాయి. ఇక ఈ ప్రాజెక్టు సెట్స్‌పైకి వెళ్లితే అల్లు అర్జున్ హీరోగా నటించనున్న 22వ సినిమా అవుతుంది.
పుష్ప 2 షూటింగ్ అప్డేట్.. 'పుష్ప ది రైజ్'కు సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప ది రూల్' చిత్రంపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలె ఈ చిత్ర బృందం ఓ అప్డేట్ ఇచ్చింది. సినిమాలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న మలయాళ స్టార్ నటుడు 'ఫహద్ ఫాజిల్'కు సంబంధించిన సన్నివేశాలను పూర్తి చేసినట్లు మూవీ టీమ్ సోషల్ మీడియా వేదిక ద్వారా వెల్లడించింది. ఇకపోతే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఈ ఏడాది డిసెంబర్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.