ETV Bharat / entertainment

ఆ దూకుడేది?.. తెలుగులో స్పీడ్​ తగ్గించిన స్టార్‌ హీరోయిన్లు! - స్పీడ్​ తగ్గించిన స్టార్​ నాయికలు

సంక్రాంతికి ఒకటి.. వేసవికి ఇంకొకటి.. దసరాకు మరొకటి.. అంటూ సీజన్‌కు ఒకటి చొప్పున ఏడాది మొత్తం వరుస సినిమాలతో జోరు చూపిస్తుంటారు కథానాయికలు. ఇక వరుసగా రెండు హిట్లు కొట్టి.. స్టార్‌ నాయికల జాబితాలో చేరారంటే ఆ జోరు రెట్టింపవ్వాల్సిందే. అనుష్క, తమన్నా, రకుల్‌, రష్మిక, పూజా హెగ్డే తదితరులంతా ఇలా వరుస చిత్రాలతో సందడి చేసిన వాళ్లే. ఇప్పుడీ నాయికలంతా బొత్తిగా నెమ్మదించేశారు. బాలీవుడ్‌ వైపు దృష్టి సారించి కొందరు..ఆచితూచి కథలు ఎంచుకోవాలన్న ఆలోచనతో మరికొందరు.. తెలుగులో స్పీడు తగ్గించేశారు.

tollywood heriones
tollywood heriones
author img

By

Published : Sep 8, 2022, 6:28 AM IST

ప్రతి సీజన్​కు ఒకటి చొప్పున ఏడాది మొత్తం సినిమాల్లో నటిస్తూ తమ జోరు చూపిస్తుంటారు హీరోయిన్లు. అనుష్క, తమన్నా, రకుల్​, రష్మిక, పూజాహెగ్డే తదితరులంతా ఇలా వరుసగా సందడి చేసిన వాళ్లే. అయితే ఇప్పుడు వారంతా తమ స్పీడ్​ తగ్గించేశారు. బాలీవుడ్‌ వైపు దృష్టి సారించి కొందరు.. ఆచితూచి కథలు ఎంచుకోవాలన్న ఆలోచనతో మరికొందరు.. తెలుగులో సినిమాలు చేయడం తగ్గించారు.

రకుల్‌.. జోరంతా హిందీలోనే
తెలుగులో స్టార్‌ నాయికల్లో ఒకరిగా వరుస సినిమాలతో జోరు చూపించింది నటి రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. మహేష్‌బాబు, ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోలందరితోనూ ఆడిపాడిన ఈ నాయిక ఇప్పుడు పూర్తిగా బాలీవుడ్‌ సినిమాలతోనే బిజీగా గడిపేస్తోంది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనకు పైగా చిత్రాలుండగా.. అందులో ఒక్కటీ తెలుగు సినిమా లేదు. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో 'భారతీయుడు2' చిత్రంలో నటిస్తున్నా.. అదీ కొత్తగా ఒప్పుకున్నదేమీ కాదు. కొన్నేళ్ల క్రితం సంతకాలు చేసిన చిత్రమే. తెలుగులో ఓ క్రీడాకారిణి జీవితకథలో నటించనున్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చినా.. అదీ కార్యరూపంలోకి రాలేదు. మరి ఆమె నుంచి మరో తెలుగు కబురు ఎప్పుడు అందుతుందో వేచి చూడాలి. రకుల్‌ ప్రస్తుతం హిందీలో 'డాక్టర్‌ జి', 'థ్యాంక్‌ గాడ్‌', 'ఛత్రీవాలి' తదితర చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో రెండు సినిమాలు చేస్తున్నట్లు సమాచారం.

tollywood heriones
రకుల్​ ప్రీత్​ సింగ్​

'నిశ్శబ్దం' తర్వాత రెండేళ్లకు..
'అరుంధతి', 'భాగమతి' సినిమాలతో నాయికా ప్రాధాన్య చిత్రాలకు చిరునామాగా మారింది నటి అనుష్క. అయితే 'బాహుబలి' ముందు వరకు వరుస సినిమాలతో జోరు చూపించిన ఈ అమ్మడు ఆ తర్వాత నుంచి పూర్తిగా జోరు తగ్గించేసింది. ఓ చిత్రం చేయడం.. కొన్నాళ్లు విరామం తీసుకోవడం.. ఇదే పంథాలో అతి నెమ్మదిగా సినీ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది. 'నిశ్శబ్దం' సినిమా తర్వాత రెండేళ్ల పాటు వెండితెరకు దూరంగా ఉన్న ఆమె.. ఆచితూచి ఓ కథకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఏకైక చిత్రం ఇదొక్కటే. అనుష్క, నవీన్‌ పొలిశెట్టి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మహేష్‌బాబు తెరకెక్కిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తోంది. వినూత్నమైన ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రం.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి
కొన్నాళ్ల క్రితం వరకు భారీ విజయాలతో జోరు చూపించిన పూజా హెగ్డే.. ఈ ఏడాది వరుస పరాజయాలు అందుకొంది. భారీ అంచనాలతో వచ్చిన 'రాధేశ్యామ్‌', 'బీస్ట్‌', 'ఆచార్య' ఆమెకు చేదు ఫలితాల్ని అందించాయి. అయినా సినిమాల పరంగా ఆమె జోరు ఏమాత్రం తగ్గలేదు. అయితే ఇటు తెలుగు సినిమాల్ని.. అటు హిందీ చిత్రాల్నీ సమంగా బ్యాలెన్స్‌ చేసుకుంటూ ముందుకెళ్లాలన్న ఆమె కోరిక నెరవేరలేదు. ముఖ్యంగా కొత్తగా ఒప్పుకున్న తెలుగు సినిమాల విషయంలో ఆమె ప్రణాళికలన్నీ తారుమారయ్యాయి. విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో మొదలైన 'జనగణమన' అర్ధంతరంగా ఆగిపోగా.. పవన్‌ - హరీష్‌ శంకర్‌ల కలయికలో చేయాల్సిన 'భవదీయుడు భగత్‌సింగ్‌' ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందన్నది తేలడం లేదు. ఒకరకంగా ఇప్పుడామె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్‌.. మహేష్‌బాబు - త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న హ్యాట్రిక్‌ చిత్రమే. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక ఆమె హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి 'సర్కస్‌', సల్మాన్‌ ఖాన్‌కు జోడీగా 'కిసీ కా భాయ్‌.. కిసీ కి జాన్‌' చిత్రాల్లో నటిస్తోంది.

tollywood heriones
పూజా హెగ్డే

హిందీని చుట్టేస్తోంది..
'పుష్ప' సినిమాతో నటిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది నటి రష్మిక. ఇప్పుడు బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ.. అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. అందుకే తెలుగులో ఆమె నుంచి ఇప్పటి వరకు మరో కొత్త కబురేమీ అందలేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న ఏకైక తెలుగు సినిమా 'పుష్ప2'. ఇది వచ్చే నెల నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించుకోనున్నట్లు సమాచారం. ఇది కాక విజయ్‌తో 'వరిసు' అనే ద్విభాషా చిత్రం చేస్తోంది. హిందీలో మాత్రం 'గుడ్‌బై', 'మిషన్‌ మజ్ను', 'యానిమల్‌' చిత్రాల్లో నటిస్తోంది. ప్రస్తుతం రష్మిక ఆశలన్నీ ఈ బాలీవుడ్‌ సినిమాలపైనే ఉన్నాయి.

tollywood heriones
రష్మిక

రాశి.. ప్రణాళికలు మారాయి!
కొన్నాళ్లుగా కథల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూ వస్తోంది నటి రాశీ ఖన్నా. ప్రస్తుతం అటు బాలీవుడ్‌ చిత్రాలతోనూ.. ఇటు ఓటీటీ సిరీస్‌లతోనూ బిజీగా గడిపేస్తూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ.. తెలుగు సినిమాల విషయంలో బాగా నెమ్మదించింది. ఇప్పుడామె చేతిలో ఉన్న ఏకైక తెలుగు ప్రాజెక్ట్‌.. శర్వానంద్‌ - కృష్ణ చైతన్యల కాంబినేషన్‌లో రూపొందనున్న కొత్త చిత్రమే. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా.. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. హిందీలో మాత్రం ఓవైపు 'యోధ' అనే యాక్షన్‌ థ్రిల్లర్‌తో పాటు 'ఫర్జీ' అనే వెబ్‌సిరీస్‌లోనూ సందడి చేస్తోంది. ఈ రెండు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక తమిళంలో కార్తితో 'సర్దార్‌'లో నటించింది.

tollywood heriones
రాశీ ఖన్నా

బాలీవుడ్‌పైనే మనసంతా..
వెండితెరపై దశాబ్దంన్నర సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న అతి కొద్దిమంది కథానాయికల్లో తమన్నా ఒకరు. సినీ కెరీర్‌ ప్రారంభించి ఇన్నేళ్లు గడుస్తున్నా.. సినిమాల విషయంలో కుర్ర నాయికలతో పోటీ పడుతూ జోరు చూపిస్తోంది. అయితే ఇప్పుడీ అమ్మడి చూపంతా బాలీవుడ్‌పైనే ఉంది. ప్రస్తుతం ఆమె హిందీలో 'బబ్లీ బౌన్సర్‌', 'బోలే చుడియాన్‌', 'ప్లాన్‌ ఎ ప్లాన్‌ బి' చిత్రాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం తెలుగులో ఆమె నటిస్తున్న ఒకే ఒక్క చిత్రం.. చిరంజీవి నటిస్తున్న 'భోళా శంకర్‌'. సత్యదేవ్‌తో కలిసి నటించిన 'గుర్తుందా శీతాకాలం' సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా.. అది ఎప్పుడో పూర్తయిన చిత్రమే. 'భోళా శంకర్‌' తర్వాత ఆమె చేయనున్న కొత్త తెలుగు చిత్రమేదన్నది ఇంత వరకు తేలలేదు.

tollywood heriones
తమన్నా

ఇవీ చదవండి: ఈ ఫొటోలో ఉన్న స్టార్​ హీరోయిన్​ ఎవరో గుర్తుపట్టగలరా?

సుస్మితా సేన్​ కుమార్తె బర్త్​​డే​.. మాజీ బాయ్​ఫ్రెండ్​తో కలిసి సెలబ్రేషన్స్​.. ఫొటోలు వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.