ETV Bharat / entertainment

రాజమౌళి-మహేశ్ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ! - మహేశ్​బాబు శ్రద్ధా కపూర్​

Mahesh Rajamouli movie: రాజమౌళి-మహేశ్​ బాబు సినిమా హీరోయిన్​ శ్రద్ధా కపూర్​ హీరోయిన్​గా నటించనుందని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే...

Mahesh Rajamouli movie shraddha
రాజమౌళి-మహేశ్ సినిమాలో బాలీవుడ్ బ్యాటీ!
author img

By

Published : Jun 8, 2022, 11:04 AM IST

Mahesh Rajamouli movie: రాజమౌళి- మహేశ్‌ బాబు కాంబోలో తెరకెక్కనున్న సినిమా.. పూర్తి స్క్రిప్టు సిద్ధమవకముందే ఎన్నో అంచనాలు పెంచేసింది. ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లోనే కాదు చిత్ర పరిశ్రమలోనూ ఆసక్తి నెలకొంది. అడవి నేపథ్యంలో సాగే యాక్షన్‌ సినిమా అనే ఊహాగానాలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇప్పుడు మరో ఆసక్తికర వార్త టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

ఈ క్రేజీ ప్రాజెక్టులో మహేశ్‌బాబు సరసన బాలీవుడ్‌ బ్యూటీ శ్రద్ధాకపూర్​ సందడి చేయనుందని టాక్‌ వినిపిస్తోంది. ఈ చిత్రంలోని కథానాయిక పాత్రకు ఆమెనె న్యాయం చేయగలదని భావించిందట చిత్ర బృందం. మహేశ్‌ బాబుతో కలిసి నటించేందుకు శ్రద్ధా సుముఖంగా ఉందని, వచ్చే ఏడాది ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయని సమాచారం. అంతకుముందు ప్రభాస్​ సాహోతో ఆమె దక్షిణాది ప్రేక్షకులను పరిచయమైంది. ఇక గతంలో మహేశ్​ సరసన ఆలియాభట్​ కూడా నటించనుందని ప్రచారం సాగింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌కు అధిక ప్రాధాన్యత ఉండే ఈ పాన్‌ ఇండియా సినిమాకు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ అందిస్తున్నారు.

ఇదీ చూడండి: 'మా బంధం ఏంటో చెప్పను.. ఏదైనా జరగొచ్చు.. ఫేక్​ మాత్రం కాదు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.