ETV Bharat / entertainment

'పఠాన్​' ప్రభంజనం.. రెండు రోజుల్లోనే రూ.200కోట్లు.. వెనక్కి తగ్గేదే లే అంటూ షారుక్​ ట్వీట్​ - పఠాన్ మూవీ కలెక్షన్స్​ 200 కోట్లు

బాక్సాఫీస్ వద్ద షారుక్ ఖాన్​ పఠాన్ దూసుకెళ్తోంది. రెండు రోజుల్లో రూ.200కోట్లపైగా వసూళ్లను అందుకుంది. ఈ సందర్భంగా షారుక్​ హర్షం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఏం అన్నారంటే..

Sharukh khan tweeet on Pathaan movie RS 200 crores club
పఠాన్​ 200కోట్లు
author img

By

Published : Jan 28, 2023, 9:48 AM IST

బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'పఠాన్‌'. దాదాపు ఐదేళ్వ తర్వాత షారుక్‌ ఖాన్‌ వెండితెరపై సందడి చేయడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్​ను షేక్ చేస్తోంది. కలెక్షన్ల విషయంలో తొలి రోజు నుంచే దూసుకుడు ప్రదర్శిస్తున్న ఈ చిత్రం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.210 కోట్లకు పైగా వసూలు చేసింది. దేశవ్యాప్తంగా రూ.120కోట్లను అందుకుంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన షారుక్​ హర్షం వ్యక్తం చేశాడు. సోషల్​మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. 'వెనక్కి తిరిగివెళ్లడానికి నా దగ్గర ఏమీ లేవు. ఎప్పుడూ ముందుకే అడుగులు వేయాలి. వెనక్కి తగ్గొద్దు. జీవితం చాలా చిన్నది. ప్రారంభించిన పనిని ముగించేందుకు ప్రయత్నించండి. ఓ 57ఏళ్ల వ్యక్తి సలహా ఇది' అంటూ ట్వీట్ చేశారు.

కాగా, స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో ఇండియ‌న్ రా ఏజెంట్​గా షారుక్ ఖాన్ కనిపించారు. ఇక ఐఎస్ఐ ఏజెంట్ పాత్ర‌లో దీపికా ప‌డుకొణె నటించారు. బాలీవుడ్ భాయ్​ స‌ల్మాన్‌ ఖాన్ అతిథి పాత్ర‌లో కనిపించి సినిమాకే హైలైట్​గా నిలిచారు. భార‌త‌దేశంపై దాడికి ప్రణాళిక రచించిన ఓ ప్రైవేట్ ఏజెంట్ ప్లాన్‌ను ప‌ఠాన్ ఎలా మట్టుబెట్టాడన్నదే ఈ సినిమా కథాంశం. క‌థ కన్నా యాక్ష‌న్ అంశాల‌కే అధికంగా ప్రాముఖ్య‌త‌నిస్తూ ద‌ర్శ‌కుడు సిద్ధార్థ్ ఆనంద్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

ఇదీ చూడండి: పఠాన్​పై ఆర్జీవి ఆసక్తికర ట్వీట్.. షారుఖ్​ ఖాన్​పై ప్రశంసల జల్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.