ETV Bharat / entertainment

Sharukh Khan Jawan Movie Collections : రొటీన్ కమర్షియల్​తోనే రూ.1000 కోట్లు.. ఇక షారుక్​ నెక్స్ట్​ టార్గెట్​ అదే! - sharkh khan duki movie

Sharukh Khan Jawan Movie Collections : 'పఠాన్​', 'జవాన్' చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్​ వరుస భారీ బ్లాక్ బస్టర్లను అందుకున్న బాలీవుడ్ బాద్​ షా షారుక్​.. తర్వాత దర్శకుడు రాజ్​కుమార్ హిరాణీతో కలిసి 'డంకీ' సినిమా చేయబోతున్నారు. రొటీన్ కమర్షియల్ చిత్రాలతోనే షారుక్ ఈ రేంజ్​లో భారీ సక్సెస్​లను అందుకున్నారంటే.. డంకీ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ఏ రేంజ్​లో సక్సెస్​ అందుకుంటారా అనేది ఇప్పుడే ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్​గా మారింది. ఆ వివరాలు..

Sharukh Khan Dunki Movie : రొటీన్ కమర్షియల్​తోనే రూ.1000కోట్లు అందుకుంటే.. ఇక డంకీ ఏ రేంజ్​లో ఉంటుందో?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 9, 2023, 3:44 PM IST

Updated : Sep 9, 2023, 3:56 PM IST

Sharukh Khan Jawan Movie : కొంతకాలం క్రితం బాలీవుడ్​ సరైన భారీ హిట్​ లేక సతమతమవుతుంటే.. సౌత్ ఇండస్ట్రీ మాత్రం వరసు పాన్ ఇండియా సక్సెస్​లను అందుకుంటూ వందల కోట్ల వసూళ్లను ఖాతాలో వేసుకుంది. వెయ్యి కోట్ల కలెక్షన్లను సాధించింది. అలాంటి సమయంలో ఐదేళ్ల పాటు గ్యాప్​ ఇచ్చి పఠాన్​తో వచ్చిన షారుక్.. ఏకంగా రూ.1000 కోట్ల కలెక్షన్లను సాధించి హిందీ పరిశ్రమకు పునఃవైభవాన్ని తీసుకొచ్చాడు.

Sharukh Jawaan Two days collections : ఇప్పుడు మళ్లీ ఏడు నెలల గ్యాప్​లోనే సెప్టెంబర్ 7న జవాన్​గా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో భారీ బ్లాక్ బస్టర్​ను ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా రెండు రోజుల్లోనే రెండు వందల కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. లాంగ్ రన్ టైమ్​లో రూ.1000 కోట్లు పక్కా సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక షారుక్ చేతిలో మరో సినిమా మాత్రమే మిగిలి ఉంది. అదే 'డంకీ'. ఇక ఈ సినిమా కూడా సూపర్ సక్సెస్​ సాధిస్తే.. షారుక్ హ్యాట్రిక్ హిట్​ అందుకున్నట్టే.

అయితే వాస్తవానికి పఠాన్, జవాన్ సినిమాలు రొటీన్ కమర్షియల్ కథలే. మంచి యాక్షన్ సీక్వెన్స్ మాసాలా దట్టించి తన అభిమానులతో పాటు సినీ ప్రియులను ఆకట్టుకున్నారు షారుక్​. భారీ యాక్షన్ విజువల్ ట్రీట్​ను అందించారు. అంటే కమర్షియల్ కంటెంట్ ఉన్న చిత్రాలతోనే రూ. 1000 కోట్ల రేంజ్​లో సక్సెస్ అందుకుంటున్నారు షారుక్. మరి అలాంటి బాలీవుడ్ బాద్​ షాకు మంచి కంటెంట్ ఉన్న ఎమోషనల్ డ్రామా తగిలితే ఎలా ఉంటుంది.

Sharukh Khan Dunki Movie : ఇప్పుడు బాద్​ షా తర్వాత నటించబోయే 'డంకీ' సినిమా అలాంటిదే. ప్రముఖ టాప్ డైరెక్టర్​ రాజ్ కుమార్ హీరాణి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఆయన సినిమాలు.. సామాజిక అంశాలే ఇతివృత్తం చేసుకొని మనసుకు హత్తుకునేలా ఉంటాయి. గతంలో ఆయన తెరకెక్కించిన మున్నా భాయ్ ఎంబీబీఎస్, లగే రహూ మున్నాభాయ్, 3 ఇడియట్స్, పీకే, సంజు.. ఇలా ప్రతీ చిత్రం బాక్సాఫీస్ హిట్​గానే నిలిచాయి. మరి ఇలాంటి సక్సెస్​ ఫుల్​ డైరెక్టర్​తో షారుక్ 'డంకీ' సినిమా చేయబోతున్నారు. అంటే ఈ చిత్రం.. దాదాపుగా సోషల్​ మెసేజ్ అండ్ ఎమోషన్స్ డ్రామాతోనే ఉంటుంది.

కాబట్టి షారుక్.. పఠాన్, జవాన్ లాంటి రొటీన్​ కమర్షియల్ సినిమాలతోనే ఈ రేంజ్ భారీ విజయాల్ని అందుకున్నారంటే.. ఇంక డంకీ లాంటి చిత్రంతో మరింత భారీ రేంజ్​లో విజయాన్ని అందుకుంటారని అభిమానులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఈ డంకీ సినిమాతో షారుక్​ ఎలాంటి సక్సెస్​ను అందుకుంటారో, బాక్సాఫీస్ వద్ద ఎలాంటి నెంబర్లను నమోదు చేస్తారా అనేది. ప్రస్తుతం ఈ విషయం ఆసక్తికరంగా మారింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Jawan Worldwide Collection Day 1 : 'జవాన్' సునామీలోనూ 'ఆదిపురుష్' టాప్.. ప్రభాస్ స్టార్​డమ్​ అంటే అట్లుంటది!

Jawan Google Animation : యానిమేషన్​తో గూగుల్ సర్​ప్రైజ్.. ఆ రికార్డు బద్దలుకొట్టారంటూ..'జవాన్​' పై మహేశ్ బాబు ట్వీట్

Last Updated : Sep 9, 2023, 3:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.