ETV Bharat / entertainment

'లుంగీ డ్యాన్స్ పాట షారుక్​కు నచ్చలేదు.. బాలీవుడ్​లో నాకు ఎప్పుడూ ఇబ్బందులే' - undefined

బాలీవుడ్ సింగర్​ యోయో హానీ సింగ్​.. ప్రముఖ హీరో షారుక్​ ఖాన్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చెన్నై ఎక్స్​ప్రెస్​ సినిమా సమయంలో వారిద్దరి మధ్య సంఘటనలను గుర్తు చేసుకున్నారు. లుంగీ డ్యాన్స్​ పాటు షారుక్​కు నచ్చలేదని తెలిపారు. ఇంకా ఏమన్నారంటే..

shahruk khan yoyo honey singh
shahruk khan yoyo honey singh
author img

By

Published : Apr 16, 2023, 8:44 PM IST

బాలీవుడ్​ ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు హనీసింగ్​ బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్​ సినిమాలకు సంగీతం అందించడం తనకు ఇష్టం లేదని చెప్పారు. అలా చేసిన ప్రతిసారి.. ఏదో ఒక విధంగా ఇబ్బంది పడ్డానని తెలిపారు. 'చెన్నై ఎక్స్​ప్రెస్​' అనే సినిమాకు చేసిన లుంగీ డ్యాన్స్​ అనే పాట షారుక్​ నచ్చలేదన్నారని తెలిపారు.

''చెన్నై ఎక్స్​ప్రెస్' చిత్రానికి ఒక పాట చేయాలని హీరో షారూక్​ ఖాన్ నన్ను పిలిచారు. ఓ ఇంగ్లీష్​ బీట్​తో మంచి పాట చేయమన్నారు. అయితే, ఇదివరకే ఆ పాట మంచి హిట్​ అయింది. దీంతో ఆ పాట నేను చేయనని చెప్పాను. కానీ, దాని కన్నా అదిరిపోయే సాంగ్​ మాత్రం చేస్తానని హామీ ఇచ్చాను. చెప్పినట్టుగానే 'లుంగీ డ్యాన్స్​' పాట చేశాను. కానీ ఈ సాంగ్​ షారుక్​ ఖాన్​కు అంతగా నచ్చలేదు. ఆ పాటను సినిమాలో పెట్టుకోవాలా లేదా అని నిర్ణయం తీసుకోవడానికి ఆయన మూడు వారాల సమయం తీసుకున్నారు. అనంతరం సినిమాలో ఆ పాటను పెట్టుకున్నారు. ఇక, లుంగీ డ్యాన్స్ పాట ఏ రేంజ్​లో ఉర్రూతలూగించిందో మీ అందరికీ తెలిసిన విషయమే' అని హనీ సింగ్​ చెప్పుకొచ్చారు.

ఇక, చెన్నై ఎక్స్​ప్రెస్​ సినిమా విషయానికి వస్తే.. షారుక్ ఖాన్, దీపికా పదుకొణె హీరో, హీరోయిన్లుగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీలోని 'లుంగీ డ్యాన్స్' అనే పాట అప్పట్లో సూపర్​ హిట్ అయింది. అన్ని వయసుల వారిని ఉర్రూతలూగించింది. ఇప్పటికి కూడా యూట్యూబ్​లో ఎక్కువ మంది చూసిన పాటల లిస్టులో ఈ పాట ఒకటిగా ఉంది.

'పఠాన్​' సంచలన విజయాన్ని ఎంజాయ్​ చేస్తున్న షారుక్ ఖాన్.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్​లో 'జవాన్' చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ పూర్తైంది. ఈ సినిమాలో షారుక్​ సరసన నయనతార నటిస్తోంది. సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మరోవైపు, రాజ్‌కుమార్ హిరానీతో కలసి 'డుంకీ' అనే సినిమా చేస్తున్నారు షారుక్​ ఖాన్. ఇందులో తాప్సీ కథానాయికగాన నటిస్తోంది. ఈ చిత్రం 2023 క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజ్​ కానుంది.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.