ETV Bharat / entertainment

సల్మాన్ కోసం సైకిల్​పై సాహసం.. 7 రోజుల్లో 1,100 కి.మీ ప్రయాణం.. చివరకు.. - డై హార్డ్ ఫ్యాన్స్ ఆఫ్ సల్మాన్​ ఖాన్​

తమ అభిమాన నటులపై ఉన్న ప్రేమను చాటుకోవడానికి కొందరు వినుత్నమైన రీతిలో సాహసాలు చేస్తుంటారు. వారినే డై హార్డ్​ ఫ్యాన్స్ అంటారు. కొందరు అభిమానులు హీరోల పేరుతో అన్నదానాలు చేస్తే మరికొందరు రక్తదానాలు వంటి కార్యక్రమాలు చేస్తుంటారు. కానీ మధ్యప్రదేశ్​కు చెందిన ఓ అభిమాని మాత్రం ఏకంగా వందల కిలోమీటర్లు సైకిల్​ తొక్కి తన ఫేవరేట్​ స్టార్​ను కలిశాడు.

Salman Khan With Fan
Salman Khan
author img

By

Published : Jan 3, 2023, 2:18 PM IST

Updated : Jan 3, 2023, 3:20 PM IST

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ది మోస్ట్​ ఎలిజిబుల్​ బ్యాచిలర్ సల్మాన్​ ఖాన్​ ఫ్యాన్​ చేసిన ఓ సాహస యాత్ర అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ఏకంగా 1,100 కిలోమీటర్లు సైకిల్​ తొక్కి తన అభిమాన సల్లూ భాయ్​ను కలిశాడు సమీర్ అనే యువకుడు.

సమీర్ స్వస్థలం మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్. గతేడాది డిసెంబర్​ 27న సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా జబల్​పుర్​ నుంచి ఈ సైకిల్ యాత్రను మొదలు పెట్టాడు. ఏడు రోజుల పాటు సైకిల్​పై ప్రయాణించి.. ముంబయికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న సూపర్​ స్టార్​ సల్మాన్​​.. సమీర్​ను కలిసేందుకు ఒప్పుకున్నాడు. అతడితో సెల్ఫీలు దిగి కాసేపు ముచ్చటించాడు. తాను సల్మాన్​ ఖాన్​ కా దీవానా(సల్మాన్​ ఖాన్​ అంటే పిచ్చి) అని చెప్తున్నాడు​ సమీర్​. కాగా, సమీర్​తో దిగిన ఫొటోలను సల్మాన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడవి వైరల్ అవుతున్నాయి.

ఇదేం తొలిసారి కాదు..
సల్మాన్​ ఖాన్​ ఫ్యాన్స్​ ఆయనను కలవడానికి​ సైకిల్​పై వందల కిలోమీటర్లు ప్రయాణించి రావడం ఇదేం మొదటిసారి కాదు. ఇలాగే 2020లో ఏకంగా గువాహాటిలో జరిగిన 65వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌ ప్రదానోత్సవానికి అసోంకు చెందిన 52 ఏళ్ల భూపేన్ లిక్సన్ అనే వ్యక్తి సుమారు 600 కిలోమీటర్లుకు పైగా సైకిల్​ తొక్కుకుంటూ వచ్చాడు. ఈ దురాన్ని ఆయన 5 రోజుల్లో పూర్తి చేశాడు.

600 Kms cycled For Salman Khan
2020లో సల్మాన్​ ఖాన్​ కోసం 600 కిలోమీటర్లు సైకిల్​ తొక్కిన భుపేన్​ లిక్సన్​

ప్రస్తుతం సల్మాన్ ఖాన్​ హిందీ బిగ్ బాస్ సీజన్ 16 హోస్టింగ్​లో బిజీగా ఉన్నారు. అలాగే 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌' సినిమాతో ఆయన తిరిగి స్క్రీన్​పై కనిపించనున్నారు. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డేతో పాటు వెంకటేష్ దగ్గుబాటి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2023 ఏప్రిల్​లో రంజాన్​ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Last Updated : Jan 3, 2023, 3:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.