ETV Bharat / entertainment

పవన్​ సినిమాలో రవీనా​.. 'సలార్​' ఛేజింగ్​ సీన్​.. మహేశ్​తో శ్రీలీల! - ప్రభాస్​ సలార్​ షూటింగ్​ అప్డేట్​

కొత్త చిత్రాల గురించి ఇంట్రెస్టింగ్​ అప్డేట్స్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో పవర్​స్టార్ పవన్​కల్యాణ్​, ప్రభాస్​, మహేశ్​బాబు, రవీనా టాండన్​, శ్రీలీల సినిమాల సంగతులు ఉన్నాయి.

Raveena tandon in pawankalyan movie
ప్రభాస్​ సలార్ ఛేజింగ్ సీన్​
author img

By

Published : Apr 25, 2022, 12:59 PM IST

Raveena Tandon Pawankalyan: 'కేజీఎఫ్​ 2' సినిమాలో బాలీవుడ్​ నటి రవీనా టాండన్​ నటించిన ప్రధానమంత్రి పాత్ర ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఎన్నో ప్రశంసలు దక్కాయి. అయితే ఇప్పుడు రవీనాకు మరో సూపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. హరీశ్​ శంకర్​ దర్శకత్వంలో పవన్​కల్యాణ్​ హీరోగా నటిస్తున్న సినిమా 'భవదీయుడు భగత్​ సింగ్'. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ఆమెను సంప్రదించినట్లు తెలిసింది. కథ, పాత్ర నచ్చి రవీనా కూడా గ్రీన్​సిగ్నల్ ఇచ్చిందట. ఒకవేళ ఇదే కనుక నిజమైతే తెలుగులో ఆమె రీఎంట్రీ ఇవ్వనున్న సినిమా ఇదే అవుతుంది. కాగా, ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్​గా నటించనుంది.

Prabhas Salar movie: 'కేజీఎఫ్'​తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్​ నీల్​. 'కేజీఎఫ్​ 2'తోనూ మరోసారి తన సత్తా చాటాడు. కథా నేపథ్యం, యశ్‌ నటన, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. దీంతో అందరీ దృష్టి ప్రశాంత్​ నీల్​ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రభాస్​ 'సలార్'​పైన పడింది. షూటింగ్​ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఓ భయంకరమైన లోయలో ఛేజింగ్​ సీన్స్​ను తెరకెక్కిస్తున్నారట. ఇప్పటికే ప్రీ క్లైమాక్స్​కు సంబంధించిన యాక్షన్​ సీన్​ చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. ఈ ఒక్క సన్నివేశం కోసం దాదాపు రూ.20కోట్లు ఖర్చు చేశారని తెలిసింది. కాగా, ఈ సినిమాలో శ్రుతిహాసన్​ హీరోయిన్​గా నటిస్తోంది.

Mahesh Babu Trivikram movie Sreeleela: సూపర్​స్టార్​ మహేశ్​బాబుతో 'పెళ్లిసందడి' బ్యూటీ శ్రీలీల చిందులేయనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 'అతడు', 'ఖలేజా' తర్వాత మహేశ్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో మరో కొత్త సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో హీరోయిన్​ పూజాహెగ్డేతో పాటు మరో గ్లామరస్​ బ్యూటీకి స్పేస్​ ఉందట. ఇందుకోసం శ్రీలీలను దర్శకుడు త్రివిక్రమ్​ సంప్రదించారని తెలిసింది. ముందుగా ఈ మూవీలో నటించడానికి ఈ ముద్దుగుమ్మ ఆసక్తి చూపించలేదట. కానీ ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్​ ఇచ్చిందని తెలిసింది. సినిమాలో మహేశ్-శ్రీలీలపై ఓ అదిరిపోయే సాంగ్​ను ప్లాన్​ చేశారట మేకర్స్​. కాగా, హారికా అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందనుంది. బాలీవుడ్​ సీనియర్​ నటుడు అనిల్​కూపర్​ మహేశ్​కు తండ్రిగా నటిస్తారని ప్రచారం సాగుతోంది.

ఇదీ చూడండి: ఈ వారమే 'ఆచార్య'.. ఇంకా ఏ చిత్రాలు రానున్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.