Rashmika Bollywood : 'పుష్ప' సినిమాతో హీరోయిన్ రష్మికకు వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుస ఆఫర్లతో ఈ ముద్దుగుమ్మ దూసుకెళ్తోంది. దక్షిణాదిలో ఇప్పటికే ఆమెకు భారీ డిమాండ్ ఉండగా.. బాలీవుడ్‌లోనూ ఆమె కోసం క్యూ కడుతున్నారు. ప్రస్తుతం రష్మిక.. 'యానిమల్' చిత్రంలో నటిస్తోంది. అంతకుముందే ఆమె నటించిన 'గుడ్ బై', 'మిషన్ మజ్ను' రిలీజ్ అయ‍్యేందుకు రెడీ అయ్యాయి. అయితే తాజాగా రష్మికకు మరో భారీ ఆఫర్ వరించినట్లు తెలుస్తోంది.
'ఆషికీ-3'లో ఈ ముద్దుగుమ్మను హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు. కార్తీక్ సరసన రష్మికను ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యే కథ విన్న రష్మిక.. ఓకే చెప్పినట్లు సమాచారం. కానీ, ఇంకా చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.
బాలీవుడ్‌లో 'ఆషికీ-3' సీక్వెల్స్‌కు మంచి ఆదరణ ఉంది. 1990లో రాహుల్ రాయ్, అను అగర్వాల్ జంటగా నటించిన 'ఆషికీ' అప్పట్లో పెద్ద విజయాన‍్ని సాధించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా 2013లో వచ్చిన 'ఆషికీ-2' సైతం సూపర్ హిట్‌గా నిలిచింది.
ఇవీ చదవండి: మరో పాన్ ఇండియా మూవీలో 'లెజెండ్ శరవణన్'!.. ఈ సారి బడ్జెట్ ఎంతో?