ETV Bharat / entertainment

పవన్​-సుజిత్ సినిమా అప్డేట్​.. షూటింగ్​ స్టార్ట్​ అప్పుడే​.. కానీ స్టోరీలో అవి లేవట! - సెట్స్​పైకి పవన్ సుజిత్ సినిమా

పవన్​ కల్యాణ్​-సుజిత్ కాంబోలో రానున్న సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్ర షూటింగ్​ త్వరలోనే ప్రారంభం కానుందని తెలిసింది. ఇంకా ఈ మూవీ కథ గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలు..

pawan sujeeth movie
పవన్​-సుజిత్ సినిమా అప్డేట్​.. షూటింగ్​ స్టార్ట్​ అప్పుడే​.. కానీ స్టోరీలో అవి లేవట!
author img

By

Published : Jan 28, 2023, 12:26 PM IST

పవర్​ స్టార్​ పవన్ కళ్యాణ్ అటు రాజకీయాల్లో ఇటు సినిమాల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో బోలేడు సినిమాలు ఉన్నాయి. కొన్ని సెట్స్​లో, మరికొన్ని స్క్రిప్టింగ్​ దశలో ఉన్నాయి. అయితే అందులో 'సాహో' డెరెక్టర్​ సుజిత్​ సినిమా కూడా ఉంది. ఇప్పటికే రిలీజైన ఓ పోస్టర్​ ఫ్యాన్స్​కు షాక్​ తెప్పించగా.. తాజాగా మరో షాకింగ్​ సర్​ప్రైజ్​ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే త్వరలో ఈ సినిమా సెట్స్​పైకి వెళ్లనుందట. జనవరి 30న పూజ కార్యక్రమాలతో లాంఛనంగా ఈ సినిమా షూటింంగ్ ప్రారంభించబోతున్నట్లు తెలిసింది.

ఇకపోతే మామూలుగా పవన్​ కల్యాణ్​ అంటే మనకు ఎనర్జిటిక్​ సాంగ్స్​, డైలాగ్స్​, ఫైట్స్ గుర్తొస్తాయి​. అలాంటిది ఇప్పుడు రానున్న సుజిత్​ సినిమాలో అలాంటివి ఉండవని సమాచారం. కేవలం యాక్షన్​ సీన్స్​ ఎక్కువగా ఉంటాయని సాంగ్స్​ ఉండకపోవచ్చని తెలుస్తోంది. లేటెస్ట్​ హిట్​ సినిమా విక్రమ్​లో కమల్​ లాగా పవన్​ ఫస్ట్​ హాఫ్​లో అంతంత మాత్రంగా కనిపిస్తారని సెకెండ్​ హాఫ్​లో ఇక అంతా పవనే ఉంటారని టాక్​. ప్రస్తుతం ఈ విషయంలో సోషల్​మీడియాలో ఫుల్​ ట్రెండింగ్ అవుతోంది. ఒకవేళ అదే నిజమైతే ఫ్యాన్స్​ ఫీలింగ్స్​ ఎలా ఉంటుందో మరి.
ఇక సినిమా విషయానిక

స్తే 'ఆర్​ఆర్​ఆర్​' లాంటి ప్రతిష్ఠాత్మక సినిమాలు నిర్మించిన ప్రముఖ డీవీవీ ఎంటర్‌టైనర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే రిలీజైన పోస్టర్​లో 'ఫైర్‌ స్ట్రోమ్‌ ఇజ్‌ కమింగ్‌' అనే క్యాప్షన్​​ జోడించారు. పోస్టర్‌ పై THEY CALL HIM #OG అని కూడా రాసుంది. పోస్టర్ బట్టి ఇది గ్యాంగ్‌స్టర్‌ మూవీలా అనిపిస్తోంది. ఈ చిత్రానికి రవి.కె.చంద్రన్ డీవోపీ అందించనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు. ఇకపోతే పవన్‌ ఈ చిత్రంతో పాటు క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో 'హరిహరవీరమల్లు'లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. దీనితోపాటు హరీశ్‌ శంకర్‌తో కలిసి 'భవదీయుడు భగత్‌సింగ్‌' తో అలరించనున్నారు.

ఇదీ చూడండి: 'పఠాన్​' ప్రభంజనం.. రెండు రోజుల్లోనే రూ.200కోట్లు.. వెనక్కి తగ్గేదే లే అంటూ షారుక్​ ట్వీట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.