బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన 'పఠాన్' చిత్రం.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలై 23 రోజులు అవుతున్నా.. బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల జోరు తగ్గలేదు. అయితే ఈ సినిమా టికెట్ రేట్లను శుక్రవారం తగ్గించారు. దీంతో ఈ మూవీ వసూళ్ల వాన ఇంకా పెరిగే అవకాశముందని ట్రేడ్ వర్గాల సమాచారం.
'పఠాన్' సినిమా నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా కలెక్షన్ల వివరాలు వెల్లడించింది. ఈ సినిమా 23 రోజుల్లో వరల్డ్ వైడ్గా రూ.976 కోట్ల గ్రాస్ సాధించిందని తెలిపింది. ఇండియాలో రూ.609 కోట్ల గ్రాస్.. రూ.505 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించిందని పేర్కొంది. అలాగే ఓవర్సీస్లో కూడా పఠాన్ కలెక్షన్లు అదిరిపోయాయి. అక్కడ రూ.367 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఓవర్సీస్ 'బాహుబలి-2' రూ. 510 కోట్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా రికార్డును పఠాన్ బద్దలకొట్టనుందో లేదో వేచి చూడాలి.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
యశ్రాజ్ ఫిల్మ్స్ సంస్థ దేశవ్యాప్తంగా టికెట్ రేట్లను రూ.110కు తగ్గించింది. దీంతో ఈ వారం కూడా 'పఠాన్' కలెక్షన్ల జోరు కొనసాగే అవకాశం ఉందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు, కార్తిక్ ఆర్యన్ నటించిన షెహజాదా, హాలీవుడ్ సినిమాలు యాంట్ మ్యాన్, వాస్ప్: క్వాంటమ్ విడుదలయ్యాయి. వీటి పోటీని తట్టుకుని కలెక్షన్లు సాధించడానికే యశ్ రాజ్ ఫిల్మ్స్ టికెట్ రేట్లు తగ్గించిందని మరో వాదన వినిపిస్తోంది. 'షెహజాదా' మూవీ టీమ్ 'బై వన్ గెట్ వన్' టికెట్ ఆఫర్ను ప్రకటించింది.
కాగా, పఠాన్ చిత్రం స్త్పై యాక్షన్ థ్రిల్లర్గా రూపొందింది. ఈ సినిమాలో షారుక్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఆడిపాడింది. జాన్ అబ్రహం కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్లో కనువిందు చేశారు. ఇక, ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.