ETV Bharat / entertainment

పవన్​ OGలో విలన్‌గా బాలీవుడ్ హీరో.. బొమ్మ బ్లాక్​ బస్టరే! - Bichagadu OTT Release

OG Movie Villain : పవర్‌స్టార్ పవన్ కల్యాణ్​, సాహో డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీ OG. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఈ సినిమాలో పవన్​ను ఢీకొట్టే రోల్​ బాలీవుడ్​ స్టార్​ ఇమ్రాన్​ హష్మీ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

og
og
author img

By

Published : Jun 15, 2023, 5:10 PM IST

Updated : Jun 15, 2023, 5:39 PM IST

OG Movie Villain : పవర్​ స్టార్​ పవన్ కల్యాణ్​ చేతిలో ఉన్న సినిమాలన్నిటిలో ఫ్యాన్స్‌కు ఫుల్​ కిక్కిస్తోంది 'OG'నే! సినిమా ప్రకటించిన నుంచి ఎప్పటికప్పుడు ఏదో ఒక అప్‌డేట్‌ ఇస్తూ ఈ మూవీ వార్తల్లో ఉంటూనే వస్తుంది. తాజాగా ఈ చిత్రం నుంచి మరో కీలకమైన అప్‌డేట్ వచ్చేసింది. బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. ఇమ్రాన్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'టైగర్ 3'లో విలన్‌గా నటిస్తున్నారు. ప్రతి నాయకుడిగా ఆయన రెండో సినిమా 'ఓజీ' కానుంది.

OG Movie Cast : ఇటీవలే కోలీవుడ్ క్రేజీ యాక్టర్ అర్జున్ దాస్‌ను కీలక పాత్రకు ఎంపిక చేశారు. మరో ప్రముఖ తమిళ హీరో విశాల్ వదిన శ్రియా రెడ్డి కూడా ఇందులో కనిపించనున్నారు. ఈ సంవత్సరం చివర్లో కానీ, 2024 ప్రారంభంలో కానీ ఈ సినిమా విడుదల కానుందని తెలుస్తోంది. పవన్ కూడా ప్రస్తుతం తన మొదటి ప్రాధాన్యత ఈ సినిమాకే ఇచ్చారు. ఇప్పటికే రెండు షెడ్యూళ్లు పూర్తి చేసుకుని, మూడో షెడ్యూల్ కూడా శరవేగంగా సాగుతోంది.

OG Movie Producer : 'ఓజీ' చిత్రానికి పవర్ స్టార్ అభిమాని, 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శ్రీమతి పార్వతి సమర్పణలో డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. ఆల్రెడీ ముంబయిలో ఓ షెడ్యూల్ చేశారు. అందులో పవన్ పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా నటిస్తున్నారు. ఆయన కూడా షూటింగులో జాయిన్ అయ్యారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Pavan Hari Hara Veera Mallu : మరోవైపు పవన్ కల్యాణ్​ , క్రిష్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు'లో కూడా బాలీవుడ్ నటుడే ప్రతి నాయకుడిగా కనిపిస్తున్నారు. బాబీ డియోల్‌తో పవన్​ను ఢీకొట్టనున్నారు. మొదట ఈ పాత్రలో అర్జున్ రాంపాల్ నటించాల్సింది కానీ షూటింగ్ ఆలస్యం అవుతూ ఉండటంతో ఆయన తప్పుకున్నారు. అర్జున్ రాంపాల్ స్థానంలో బాబీ డియోల్‌ను తీసుకున్నారు. మొగలు చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ కనిపించనున్నారు.

ఓటీటీలోకి బిచ్చగాడు, అన్నీ మంచి శకునములే
Bichagadu OTT Release : తమిళ నటుడు విజయ్‌ ఆంటోనీ, కావ్య థాపర్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త చిత్రం 'బిచ్చగాడు 2'. విజయ్‌ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే నెలాఖర్లో థియేటర్లలో విడుదలై సూపర్‌హిట్‌ అందుకుంది. సోదరి సెంటిమెంట్‌తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం తెలుగు, తమిళంలో మంచి ఆదరణ సొంతం చేసుకుంది. తాజాగా బిచ్చగాడు 2 ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 18 నుంచి ఈ సినిమా సినీ ప్రియులకు అందుబాటులో ఉండనుంది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో దీన్ని వీక్షించవచ్చు.

Anni Manchi Sakunamule OTT Release : నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'అన్నీ మంచి శకునములే' ఈ ఏడాది ప్రేక్షకులను ఆకట్టుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఎమోషనల్‌గా ప్రతి ఒక్కరినీ కదిలించింది. సంతోష్‌ శోభన్‌, మాళవిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా జూన్‌ 17 నుంచి అందుబాటులో ఉండనుంది.

Last Updated : Jun 15, 2023, 5:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.