ETV Bharat / entertainment

పులితో ఎన్టీఆర్ ఫైట్​ సీన్​ మేకింగ్ వీడియో చూశారా - ఆర్‌ఆర్‌ఆర్‌ రామ్​చరణ్

NTR Tiger Fight Scene దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన పాన్​ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్​లో ఎన్టీఆర్ నటన భారతీయ ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ సినిమా ప్రముఖులను సైతం మెప్పించింది. ముఖ్యంగా పెద్ద పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్ అద్భుతమని చెప్పొచ్చు. తాజాగా పులితో ఎన్టీఆర్ తలపడిన మేకింగ్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.

NTR Tiger Fight Scene IN RRR
ఎన్టీఆర్
author img

By

Published : Aug 27, 2022, 5:10 PM IST

Updated : Aug 27, 2022, 5:20 PM IST

NTR Tiger Fight Scene: ఎన్టీఆర్-రామ్‌చరణ్‌ ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి రూపొందించిన బిగ్గెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'ఆర్‌ఆర్‌ఆర్‌'. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఈ సినిమాలోని చాలా సన్నివేశాలు 'వావ్‌' అనిపించేలా గ్రాండ్ లెవల్‌లో ఉంటాయి. హీరోలిద్దరి పరిచయ సన్నివేశాలు.. అందులోనూ తారక్‌ ఎంట్రీ సీన్‌ అయితే చెప్పడానికి మాటలు సరిపోవు.

.
  • " class="align-text-top noRightClick twitterSection" data="">

పెద్దపులితో భీకర పోరాటం చేస్తూ ఎన్టీఆర్‌ ఎంట్రీ ఇస్తుంటే.. థియేటర్‌లో ఫుల్‌ సౌండ్‌లో ఆ సీన్‌ చూసిన ప్రేక్షకులకు రోమాలు నిక్కబొడుచుకున్నాయంటే అతిశయోక్తి కాదు. కాగా, ఈ సీన్‌ని ఎలా చిత్రీకరించారో తెలియజేస్తూ 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ తాజాగా మేకింగ్‌ వీడియో షేర్‌ చేసింది. నిమిషం నిడివి గల ఈ వీడియోలో మొదట సినిమా సీన్‌ని చూపించి.. తర్వాత దాన్ని ఎలా తీర్చిదిద్దారో తెలియజేశారు. తారక్‌పై దాడి చేసేందుకు పులి ఎలా ముందుకు ఉరుకుతుంది? పంజా విసిరేందుకు ఏవిధంగా ప్రయత్నిస్తుంది? ఇలా ప్రతి విషయాన్ని జక్కన్న క్షుణ్ణంగా తెలియజేస్తూ కనిపించారు. ప్రస్తుతం వీడియో మూవీ లవర్స్‌ని బాగా ఆకర్షిస్తోంది.

ఇక, 'ఆర్‌ఆర్‌ఆర్‌' విషయానికి వస్తే సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రామ్‌చరణ్‌ అల్లూరి సీతా రామరాజుగా, తారక్‌ కొమురం భీమ్‌గా మెప్పించారు. ప్రస్తుతం ఈ సినిమా డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌, జీ 5, నెట్‌ఫ్లిక్స్‌ వేదికలుగా అందుబాటులో ఉంది.

ఇవీ చదవండి: బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్​కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్

ఘనంగా కమెడియన్​ ఆలీ కూతురు నిశ్చితార్థం, వీడియో చూశారా

Last Updated : Aug 27, 2022, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.