యంగ్ హీరో నాగ చైతన్య-హీరోయిన్ సమంత విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఏదో ఒక విషయంలో సోషల్‌మీడియాలో ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉన్నారు. పర్సనల్ లేదా ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి హాట్‌టాపిక్‌గా మారుతూనే ఉంటారు. విడిపోయి రెండేళ్లు అవుతున్నప్పటికీ.. ఈ జంట మళ్లీ కలవాలని అభిమానులు ఇప్పటికీ ఆశిస్తున్నారు. అయితే వీరిద్దరూ విడిపోయాక.. ఏమైనా ఇంటర్వ్యూలో మాట్లాడినా, సోషల్‌మీడియాలో ఏదైనా పోస్ట్ చేసినా.. అవి ఒకరినొకరు ఉద్దేశించి పరోక్షంగా అనుకున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి.
ఈ క్రమంలోనే తాజాగా చైతూ అన్న కామెంట్స్ వైరల్‌గా మారాయి. ప్రస్తుతం 'కస్టడీ' సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నాగ చైతన్య.. రీసెంట్గా ఓ ప్రముఖ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో 'మీ జీవితంలో పశ్చాత్తాపపడ్డ సంఘటనలు, విచారకరమైనవి గానీ ఏమైనా ఉన్నాయా..' అని అడగగా.. అలాంటివి ఏవీ లేవని బదులిచ్చారు. 'ఇప్పటి వరకు నా జీవితంలో విచారకరమైన సంఘటనలంటూ ఏవీ లేవు. జీవితంలో జరిగే ప్రతిదీ ఒక పాఠాన్ని నేర్పుతుంది. సినిమాల విషయంలో మాత్రం కొన్ని సార్లు బాధపడ్డాను. కొన్ని సినిమాల గురించి సరిగ్గా నిర్ణయం తీసుకోలేకపోయానని పశ్చాత్తాపపడుతుంటాను. ఓ మూడు సినిమాల విషయంలో పశ్చాత్తాపడ్డాను" అని అన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇకపోతే నాగచైతన్య.. బంగార్రాజు సినిమా తర్వాత హిట్‌ను అందుకోలేదు. ఆయన నటించిన థ్యాంకూ, లాల్ సింగ్ చద్దా చిత్రాలు భారీ అంచనాలతో వచ్చి బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో చైతూ.. తన ఆశలన్నీ 'కస్టడీ' పైనే పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదలకు నెలరోజుల ముందు నుంచే ప్రమోషన్స్‌లో పాల్గొనడం ప్రారంభించారు. సినిమాలో కానిస్టేబుల్‌గా నటించిన ఆయన.. ప్రమోషన్స్‌లో భాగంగా రియల్ లైఫ్ పోలీసులతో ముచ్చటిస్తూ పలు వీడియోలు కూడా చేశారు. ఆ వీడియోలు సోషల్‌మీడియాలో రీసెంట్గా ట్రెండ్ కూడా అయ్యాయి.
ఇక చైతూ పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఆయన రీసెంట్గా తన అభిరుచికి తగ్గట్టుగా హైదరాబాద్‌లోనే ఓ ఇల్లును కట్టించుకున్నారని తెలిసింది. అలానే ఆయన యంగ్ హీరోయిన్ శోభితా ధూళిపాలతో రిలేషన్లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వారిద్దరు కలిసి లండన్‌లో ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఫొటో కూడా వైరల్ అయింది. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.
కాగా, 'కస్టడి' సినిమా మే 12న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందింది. నాగ చైతన్య.. శివ అనే పోలీస్‌గా కనిపించనున్నారు. హీరోయిన్గా కృతిశెట్టి నటించింది. యాక్షన్ అంశాలకి పెద్దపీట వేస్తూ.. శ్రీనివాసా సిల్వర్‌స్క్రీన్ బ్యానర్‌పై రపొందిన ద్విభాషా చిత్రమిది.శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. అరవింద్ స్వామి, ప్రియమణి కీలక పాత్రలు పోషించారు. సంపత్‌రాజ్, శరత్‌కుమార్, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కూడా ఇతర పాత్రల్లో నటించారు. ఎస్.ఆర్.కదిర్ - ఛాయాగ్రహణం, వెంకట్ రాజన్ - కూర్పు, అబ్బూరి రవి - సంభాషణలు, రాజీవ్ - ప్రొడక్షన్ డిజైన్, ఇళయరాజా, యువన్ శంకర్ రాజా - సంగీతం అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ప్లాన్ సూపర్.. ఆ మాస్ దర్శకుడితోనే!