ప్రముఖ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తన అనుచితమైన వీడియోలు, ఫొటోలను వైరల్ చేసిందంటూ ఓ మహిళా మోడల్ ఫిర్యాదు చేయడంతో ముంబయిలోని అంబోలీ పోలీసులు రాఖీ సావంత్ను అరెస్టు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం ఆమెను అంబోలి పోలీస్ స్టేషన్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
మరో నటి షెర్లిన్ చోప్రా ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. రాఖీ సావంత్ అరెస్ట్ విషయాన్ని షెర్లిన్ చోప్రా స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. రాఖీపై దాఖలైన కేసు గురించి కూడా పేర్కొంది. షెర్లిన్కు సంబంధించిన అభ్యంతరకర వీడియోలను వైరల్ చేస్తానని రాఖీ బెదిరించినట్లు సమాచారం. అయితే గురువారం మధ్యాహ్నం రాఖీ.. తన డ్యాన్స్ అకాడమీని ప్రారంభించనుంది. అంతకుముందే పోలీసులు ఆమెను అరెస్టు చేయడం గమనార్హం. కాగా, ఇటీవలే తన ప్రియుడు ఆదిల్ దురానీని రాఖీ పెళ్లాడింది.