ETV Bharat / entertainment

మంచు విష్ణు-మనోజ్​ గొడవలో ట్విస్ట్​.. మరో షాకింగ్ వీడియో రిలీజ్​! - మంచు విష్ణు మంచు మనోజ్​ మధ్య గొడవలు

కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. రీసెంట్​గా మంచు విష్ణు-మనోజ్‌ల మధ్య గొడవ జరిగిందంటూ ఓ వీడియో బయటకు వచ్చింది. అయితే ఇప్పుడదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ షాకింగ్ వీడియోను రిలీజ్ చేశారు విష్ణు. ఆ వివరాలు..

Manchu Vishnu new video release
మంచు విష్ణు-మనోజ్​ గొడవలో ట్విస్ట్​.. మరో షాకింగ్ వీడియో రిలీజ్​!
author img

By

Published : Mar 30, 2023, 7:57 PM IST

Updated : Mar 30, 2023, 9:03 PM IST

టాలీవుడ్​లో మంచు ఫ్యామిలీకు ఉన్న గుర్తింపు తెలిసిందే. నటుడిగా డైలాగ్ కింగ్​ మోహన్ బాబు ఎన్నో సూపర్​ హిట్ చిత్రాల్లో నటించారు. ఆయన నట వారసత్వాన్ని కొనసాగిస్తూ.. కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్​లు కూడా హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అయితే గత కొంత కాలంగా ఆ కుటుంబంలో వివాదాలు జరుగుతున్నాయని జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే మంచు మనోజ్​ రీసెంట్​గా ఓ వీడియోను రిలీజ్​ చేసి అందర్నీ షాక్​కు గురి చేశారు. మంచు విష్ణు.. ఎవరో ఇంటి మీదకు వెళ్లి.. గొడవ చేస్తున్నట్టు ఆ వీడియోలో కనిపించింది. ఆ వీడియో బ్యాక్​ గ్రౌండ్​లో.. మనోజ్ మాట్లాడుతూ.. మా బంధవుల ఇంటి మీదకు ఇలా వచ్చి దాడి చేస్తూ ఉంటారండి అంటూ మాట్లాడారు. మళ్లీ ఆ వీడియోను డిలీట్ చేశాడు. అప్పటికే ఆ వీడియో వైరల్ కావడంతో.. మంచు విష్ణు స్పందిస్తూ.. మనోజ్ తెలియక చేశాడంటూ కవర్​ చేశారు. దీంతో మంచు ఫ్యామిలీలో వివాదాలు జరుగుతున్న ప్రచారం ఈ వీడియోతో మరింత ఊపందుకుంది.

ఇప్పుడు మళ్లీ ఆ గొడవ గురించి ప్రస్తావిస్తూ మరో వీడియోను రిలీజ్​ చేశారు మంచు విష్ణు. 'ఇది కేవలం ఆరంభం మాత్రమే' అంటూ చెప్పుకొచ్చారు. House of Manchu Teaser పేరుతో దీనిని విడుదల చేశారు. ఈ వీడియోలో మంచు కుటుంబం ఇంటిని, కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకుంటూ కనిపించారు. చివరికి 'ఇదొక రియాలిటీ షోకు సంబంధించింది' అంటూ ఈ వీడియోను ముగించారు. అయితే, దీన్ని ఎందుకు విడుదల చేశారనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపై మాత్రం భినాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొంతమంది మంచు మనోజ్​ షేర్ చేసిన వీడియో.. ఇప్పుడు విష్ణు షేర్​ చేసిన కొత్త వీడియో చూసి.. ఇదంతా ప్రమోషన్స్ కోసమే చేశారా అని అభిప్రాయపడుతున్నారు. ఇంకొంతమంది.. గొడవల వల్ల బయటపడ్డ పరువును కాపాడుకోవడానికి ఇలా చేస్తున్నారని అంటున్నారు. 'ఏప్రిల్ రాకుండానే అందరినీ భలే ఫూల్ చేశారుగా', 'మంచు ఫ్యామిలీ ఏం చేసినా ఇలాగే చేస్తుంది' అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ మంచు ఫ్యామిలీ భారీగా ఏదో ప్లాన్ చేస్తుందని మాట్లాడుకుంటున్నారు. విష్ణు షేర్ చేసిన ఆ రియాలిటీ షో ఎలా ఉండబోతుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ అన్నదమ్ములిద్దరి సినిమాల విషయానికొస్తే.. మనోజ్​ రీసెంట్​గా ఓ కొత్త సినిమాను ప్రకటించారు. ప్రస్తుతం అది షూటింగ్ జరుపుకుంటోంది. అలాగే విష్ణు.. కొద్ది రోజుల క్రితం జిన్నా అనే చిత్రం తో డిజాస్టర్​ను అందుకున్నారు. ప్రస్తుతం కొత్త సినిమాలను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: చీరలో చైతూ రూమర్​ గర్ల్​ఫ్రెండ్ శోభిత​ హొయలు

Last Updated : Mar 30, 2023, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.