టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా హ్యాండ్సమ్ హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఒకరు. ఆయన అందం, ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకు లుక్స్, గ్లామర్ విషయంలో కాస్త ఛేంజ్ చేసినప్పటికీ బాడీ విషయంలో పెద్దగా మార్పులు చేయరు. హీరోగా తన కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి కూడా వయసు ఏమాత్రం పైకి కనిపించకుండా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఆయన్ను ఎవరూ చూసిన వయసు తగ్గిపోతుందనే అంటుంటారు. అలా ఐదు పదుల వయసు దగ్గర పడుతున్నప్పటికీ కూడా ఇంకా పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తుంటారు.
ఇలా ఒకే తరహాలో తన శరీరాన్ని మెయింటైన్ చేసేందుకు మహేశ్ ప్రత్యేక జాగ్రత్తలు కూడా తీసుకుంటుంటారు. అయితే ఈ సారి మహేశ్ తన కొత్త సినిమా కోసం ఊహించని విధంగా కనిపించేందుకు సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది. ఇందుకోసం ఆయన కండలు కూడా పెంచుతున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఇకపోతే ప్రస్తుతం మహేశ్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB 28 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ ఎలివేషన్స్ కూడా గట్టిగానే ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఫైట్ సీన్స్ ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చేలా తెరకెక్కిస్తున్నారని సమాచారం. అసలు ఈ సినిమా షూటింగ్‌ను యాక్షన్ ఎపిసోడ్స్‌తోనే ప్రారంభించారు. దీని కోసమే ఆయన ఫిట్నెస్ను మరింత పెంచుకున్నట్లు అర్థమవుతోంది. అలానే ఈ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళితోనూ ఓ భారీ బడ్డెట్ అడ్వెంచర్ సినిమా చేస్తున్నారు మహేశ్. అలా ఈ చిత్రం కోసం కూడా తన కండలను పెంచుతున్నట్లు అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కాగా, ఇప్పటివరకు మహేశ్ జిమ్‌లో ఎన్ని సార్లు వర్కౌట్లు చేస్తూ కనిపించినా తన బాడీని మాత్రం చూపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం తన కటౌట్‌ను చూపిస్తూ ఫొటోకు పోజు ఇవ్వడం ఆయన అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఇదీ చూడండి: ఎర్ర చీరలో దివి.. ఈ ముద్దుగుమ్మ నడుము మడతలో ఎన్ని సొగసులో