Kamalhassan Vikram making video: యూనివర్సల్ స్టార్ కమల్‌హాసన్ నటించిన తాజా చిత్రం 'విక్రమ్'. మాదకద్రవ్యాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. కొన్నివారాలపాటు థియేటర్లలో అలరించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ వేదికగా అందుబాటులోకి సూపర్ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్‌లు చూసి సినీ ప్రియులందరూ ఔరా..! అంటున్నారు. ఈ నేపథ్యంలో 'విక్రమ్' ఫైట్ సీక్వెన్స్‌లకు సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్రానికి ఫైట్ మాస్టర్లగా వ్యవహరించిన అన్నదమ్ములు అన్బు-అరివు ట్విటర్ వేదికగా షేర్ చేశారు. యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించేటప్పుడు కెమెరా వెనుక అసలేం జరిగిందో, కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్‌తోపాటు ఏజెంట్ టీనాలపై ఫైట్స్ ఎలా కొరియోగ్రఫీ చేశారో ఇందులో చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది.
-
Here’s the memorable, #VikramStuntsBTS
— AnbAriv (@anbariv) July 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Choreographing for #Ulaganayagan @ikamalhaasan sir is RARER than RAREST of the experiences. #Vikram for us is pure BLISS. In @Dir_Lokesh ‘s style it is LIFETIME SETTLEMENT!!!@VijaySethuOffl #FaFa #Mahendran @anirudhofficial @RKFI pic.twitter.com/rW7erRcNk3
">Here’s the memorable, #VikramStuntsBTS
— AnbAriv (@anbariv) July 9, 2022
Choreographing for #Ulaganayagan @ikamalhaasan sir is RARER than RAREST of the experiences. #Vikram for us is pure BLISS. In @Dir_Lokesh ‘s style it is LIFETIME SETTLEMENT!!!@VijaySethuOffl #FaFa #Mahendran @anirudhofficial @RKFI pic.twitter.com/rW7erRcNk3Here’s the memorable, #VikramStuntsBTS
— AnbAriv (@anbariv) July 9, 2022
Choreographing for #Ulaganayagan @ikamalhaasan sir is RARER than RAREST of the experiences. #Vikram for us is pure BLISS. In @Dir_Lokesh ‘s style it is LIFETIME SETTLEMENT!!!@VijaySethuOffl #FaFa #Mahendran @anirudhofficial @RKFI pic.twitter.com/rW7erRcNk3
అసలు కథేంటంటే:
'విక్రమ్'... పవర్‌ఫుల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో కమల్‌హాసన్.. కర్ణన్ అలియాస్ విక్రమ్ పాత్రలో నటించారు. భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్న పోలీస్ అధికారి ప్రభంజన్, ఆయన తండ్రి కర్ణన్ (కమల్‌హాసన్)ను ఓ ముఠా చంపేస్తుంది. ఈ డ్రగ్స్ దందాను నిలువరించి, హత్యలకు పాల్పడుతున్న ఆ ముఠాను పట్టుకునేందుకు అమర్(ఫహద్ ఫాజిల్) అనే స్పై ఏజెంట్, అండర్ కవర్ ఆఫీసర్ రంగంలోకి దిగుతాడు. కేసు దర్యాప్తు చేస్తోన్న సమయంలో ఈ డ్రగ్స్ మాఫియా వెనుక సంతానం (విజయ్ సేతుపతి) హస్తం ఉన్నట్లు గుర్తిస్తాడు. అంతేకాకుండా కర్ణన్ బతికే ఉన్నట్లు తెలుసుకుంటాడు. అసలు కర్ణన్ ఎవరు? చనిపోయినట్లు ఎందుకు బయట ప్రపంచాన్ని నమ్మించాడు? అమర్ ఈ కేసును ఎలా ఛేదించాడు? రోలెక్స్ (సూర్య) పాత్ర ఏమిటి?.. ఇలాంటి ఎన్నో ఆసక్తికర అంశాలతో లోకేశ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అనిరుధ్ స్వరాలు సమకూర్చారు.
ఇదీ చూడండి: జిమ్‌లో 'కార్తీక దీపం' మోనిత.. కుర్రాళ్లకు చెమటలు పట్టించేస్తోందిగా!