ETV Bharat / entertainment

హిట్​ డైరెక్టర్​తో కమల్​ కొత్త మూవీ?.. ఫ్యాన్స్​కు 'యాక్షన్​' బొనాంజా! - కమల్ హాసన్ కొత్త సినిమా

'విక్రమ్' సినిమాతో ఘన విజయం అందుకున్నారు విలక్షణ నటుడు కమల్ హాసన్​. ఆ జోష్​తో ఇప్పుడు ఆయన వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తాజాగా మరో హిట్​ దర్శకుడికి కమల్​ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారట​.

kamal haasan new film
kamal haasan new film
author img

By

Published : Oct 31, 2022, 2:21 PM IST

Kamal Hasan New Movie: 'విక్రమ్‌' చిత్రంతో ఘన విజయం అందుకున్నారు సూపర్ స్టార్ కమల్​ హాసన్. ఆ ఉత్సాహంతో వరుస సినిమాలకు ఓకే చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన​ దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారతీయుడు-2 చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పుడు అందరి కళ్లు ఆయన రాబోయే సినిమాలపై పడింది. కాగా, శంకర్ సినిమా అయ్యాక కమల్.. మలయాళ దర్శకుడు నారాయణన్ డైరెక్షన్​లో చేయనున్నారు. వీటితో పాటు తమిళ బిగ్​బాస్​కు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు.

తాజాగా మరో చిత్రానికి కూడా కమల్‌ హాసన్‌ పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. అజిత్‌ హీరోగా 'నేర్కొండ పార్వై', 'వలిమై' వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు హెచ్‌ వినోద్‌.. ఇటీవలే కమల్​కు కథ వినిపించినట్లు సమాచారం. కమల్ కూడా గ్రీన్​ సిగ్నల్‌ ఇచ్చారని టాక్ నడుస్తోంది. ఒక యాక్షన్‌ గేమ్‌ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుందని కోలీవుడ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇవీ చదవండి : వీరయ్య నుంచి బాలయ్య దాకా రాబోయే సినిమాల రిలీజ్​ డేట్స్​ ఇవే

ఫుల్​ ఫన్​, రొమాంటిక్​గా 'ఊర్వశివో రాక్షసివో' ట్రైలర్​.. 'హరోం హర' అంటున్న హీరో సుధీర్​ బాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.