జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ మూవీ అవతార్: ది వే ఆఫ్ వాటర్. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో అవతార్3 ఎలా ఉంటుంది? ఏ నేపథ్యంలో సాగుతుంది? అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని చెప్పారు దర్శకుడు జేమ్స్ కామెరూన్.
ఇటీవల క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ మూవీ కేటగిరిలో అవతార్2 అవార్డు సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కామెరూన్ 'అవతార్3' గురించి మాట్లాడారు. అగ్ని ప్రధానంగా మూడో భాగం సాగుతుందని చెప్పారు. "అగ్ని ఒక చిహ్నం.. ప్రయోజనకారి. మూడో భాగంలో ఇదే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. సంస్కృతి మిళతమై కాన్సెప్ట్ సాగుతుంది. ఇంతకు మించి చెప్పకూడదేమో. దీంతో పాటు మరో రెండు సంస్కృతులు కూడా మీకు పరిచయం అవుతాయి. ఒమక్టయా, మెట్కైనా తెగలను మీరు కలుస్తారు. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం" అని అన్నారు.
ఇదే విషయమై కామెరూన్ సతీమణి ఆసక్తికర కామెంట్ చేశారు. 'మీ సీట్‌బెల్ట్ మరింత భద్రంగా ఉంచుకోవాల్సిన అవసరం' ఉంది అన్నారు. ఈ వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మూడో భాగం పాండోరాలోని ఎడారిలాంటి ప్రదేశంలో సాగుతుందని హాలీవుడ్ టాక్. అక్కడ ఉండే సంపదను సొంతం చేసుకునేందుకు మనుషులు ఏం చేశారు? జేక్, అతడి కుటుంబ వారిని ఎలా అడ్డుకుంది? ఈ క్రమంలో జేక్ కుటుంబానికి ఎలాంటి ఆపద కలిగింది? వంటి అంశాలను కామెరూన్ మిళితం చేశారని అంటున్నారు. ఏదేమైనా దీని గురించి మరికొన్ని వివరాలు తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే!
'అవతార్2'తో పాటే 'అవతార్3' చిత్రీకరణ కూడా జేమ్స్‌కామెరూన్ దాదాపు పూర్తి చేశారు. కొంత ప్యాచ్ వర్క్‌తో పాటు, కీలకమైన విజువల్ ఎఫెక్ట్స్ పని మిగిలి ఉంది. ఈ సినిమాను 2024 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర బృందం చెప్పింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: తెలుగు సీరియల్లో షారుక్ ఖాన్ సందడి మీరు చూశారా