ETV Bharat / entertainment

'కొన్ని పొరపాట్లు జరిగాయి.. నాపై కావాలనే ఆ పంచ్​లు.. అయినా...'

Jabardast Dorababu: 'జబర్దస్త్'​ ద్వారా ఫేమస్​ అయిన ఆర్టిస్ట్, కమెడియన్​​ దొరబాబు.. తాజాగా ఈటీవీ భారత్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్​ గురించి పలు విషయాలను చెప్పుకొచ్చాడు. తనను ఎవరు ప్రోత్సహించారు, తన లక్ష్యం ఏమిటి? వంటి విషయాలను తెలిపాడు. తన జీవితంలో కొన్ని పొరపాట్లు జరిగాయని గుర్తుచేసుకున్నాడు. ఆ సంగతులివీ..

Jabardast Dorababu
జబర్దస్త్​ దొరబాబు
author img

By

Published : Jun 18, 2022, 10:16 AM IST

జబర్దస్త్​ దొరబాబు

Jabardast Dorababu: నటుడు అవ్వాలనే కోరికతో హైదరాబాద్​ వచ్చిన అతడు.. 'జబర్దస్త్'​ దొరబాబుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సినిమాల్లో నటించినా రాని ఫేమ్​ను ఈ ఒక్క షోతో సంపాదించుకున్నాడు. ఆది టీమ్​లో కంటెస్టెంట్​గా ఉండే ఇతడు.. తనపై పంచ్​లు వేయించుకుంటూ.. ఇతరులపై వేస్తూ.. ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు. తాజాగా ఈటీవీ భారత్​ అతడిని పలకరించింది. అతడి కెరీర్​ ఎలా మొదలైంది? ప్రస్తుతం ఎలా సాగుతుంది? వంటి విషయాలను అడిగి తెలుసుకుంది. అవన్నీ అతడి మాటల్లోనే..

వారిద్దరి వల్లే ఈ స్థాయికి.. "2015 నుంటి ప్రయత్నిస్తే.. 2016లో ఆది టీమ్​ లీడర్​ అయ్యాక అవకాశం దొరికింది. అప్పటికే బ్యాక్​గ్రౌండ్​ ఆర్టిస్ట్​గా నటిస్తుండేవాడిని. 'జబర్దస్త్'​లోని ఒక్క ఎపిసోడ్​లో​ కనిపిస్తే చాలు, ఒక్క డైలాగ్​ చెప్తే చాలు అనుకున్నా. కానీ ఆ తర్వాత ఆది టీమ్​లో చేయడం.. అలా నాగబాబుగారికి కనెక్ట్​ అవ్వడం.. ఆయన ప్రోత్సహించడం ద్వారా చాలా స్కిట్​లు, క్యారెక్టర్లు చేశా. మొత్తంగా నన్ను, మా టీమ్​ను ఆదిరించినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఓ కామెడీ షో ఇన్ని సీజన్లు కొనసాగడం ప్రపంచంలో ఇదే తొలిసారి అనుకుంటున్నా. ఈ షో ఎంతో మంది కళాకారులకు జీవితాన్ని ఇచ్చింది. సమాజంలో ఆర్టిస్టులుగా, గౌరవాన్ని ఇచ్చింది. గుర్తింపు తెచ్చి పెట్టింది. వారిని ఓ స్థాయికి తీసుకెళ్లింది. అందరూ బాగా సెటిల్​ అయ్యారు. మొత్తానికి మొదటినుంచి ఆది బాగా ప్రోత్సహించారు. దానికి నాగబాబు బాగా సపోర్ట్​ చేశారు. వారిద్దరి వల్లే నేను ఈ స్థాయికి చేరుకున్నా.

నాపై కావాలనే ఆ పంచ్​లు.. చూసేవాళ్లు దాదాపుగా అందరూ నా పంచ్​లన్నీ వేస్తుంటారు. ఒక్కో క్యారెక్టర్​ ద్వారా ఒక్కొక్కరు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఈ షోలో ముందుకు వెళ్లాలి. రాజమౌళి అనే ఆర్టిస్ట్​ తాగుబోతు, కొమరం అనే అతను అరవడం.. అలా ఒక్కొక్కరికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాగే నా జీవితంలో జరిగిన కొన్ని కొన్ని విషయాల వల్ల.. అది ప్రజలకు మరోలా అర్థమైంది. వాటిమీద పంచ్​లు వేసినంత మాత్రాన నిజంగా మనం అలా చేసినట్లు కాదు. అయినా వీటిని ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకుంటున్నారు. వారి నుంచి వచ్చే స్పందనను నేను, మా ఫ్యామిలీ కూడా సంతోషంగానే స్వీకరిస్తున్నాం. జీవితంలో కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. వాటినే నాకు పర్సనల్​గా ఆపాదించి స్కిట్​లలో డైలాగ్​లు, పంచ్​లు వేయడం జరుగుతుంది. వాటి వల్ల తెలియని ఏదో ఫీలింగ్ ఉన్నా కానీ.. ఏదైనా నవ్వించడం కోసమే.

దాని​ కోసం ఎదురుచూస్తున్నా.. బయటకు వెళ్తే జనం గుర్తుపట్టాలి. మంచి పేరు తెచ్చుకోవాలి అని సినిమా రంగాన్ని ఎంచుకున్నాను. ఆ తర్వాత 'జబర్దస్త్'​ వచ్చిందని తెలుసుకొని చూడటం ప్రారంభించాను. మంచి ఫేమ్​ తెచ్చుకోవాలంటే ఈ ప్లాట్​ఫామ్​ సరైనది అని తెలిసి ప్రయత్నించాను. అలానే సాధించాను. ప్రస్తుతం సినిమాలు బాగానే చేస్తున్నాను. మంచి బ్రేక్​ కోసం ఎదురుచూస్తున్నాను. ఇక వ్యక్తిగతంగా నా గురించి చెప్పాలంటే సంతోషం, బాధ ఏది వచ్చినా నేనెప్పుడు ఒకేలా ఉంటాను.

ఇదీ చూడండి: జెనీలియా రీఎంట్రీ ఆ క్యారెక్టర్​తోనే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.